పిచ్చిలో….

నేనో పిచ్చిమొక్కనిరోడ్డు పక్కో, సగం కూలిన గోడ సందులోనో పుట్టుకొస్తా నాలాంటిదే పిచ్చిగాలికొంచెం జోరుగా, కొంచెం తూలినట్లుగా వీస్తాదినేనూ ఊగుతా నా ఒంటరితనం మాయమైపోవడం ఇష్టంలేనిచెయ్యొక్కటి నా గొంతును నులుముతుంది గాలి పిచ్చితోటి నా తలఆ చేతిలో ఊగుతానే ఉంటది

సూర్యుడు నా ఆదర్శం

పెగ్గుల్ని పరామర్శించికొద్దిగా నిద్దరోతానామళ్ళీ వచ్చేస్తాడు చీకటి తవ్వి పాతరేసినామబ్బులు ఉతికి ఆరేసినానిబ్బరంగా ఉంటాడుఅంబరాన సూర్యుడు నదికి, సముద్రానికిఒకేసారి కన్నుకొడతాడుఆకతాయి సూర్యుడు దిశమొలతో నిలబడేదిక్కుల్ని వెలిగిస్తాడుసిగ్గులేని సూర్యుడు సూర్యుడు నా ఆదర్శం వెలిసిపోయిన నా జీవితాన్నివిప్పేస్తున్నానువెలుగుల్ని విరజిమ్మడానికి సంఘమాకళ్ళు తెరిచే ఉంచు!