నిజంగానే!

వాడు రాత్రి బాటసారి అవతారమెత్తి చేదుపాట పాడుకొంటో సమస్యల్ని తోలుకొంటో అవతలి గట్టుకు వాడు మానవుడా? మిథ్యావాదా? ఆశాదూతా? ఋక్కుల్ని గంటలుగా మోగించుకొంటూ శైశవ గీతిని అద్వైతానికి అర్థంగా చెప్పుకొంటూ జ్వాలాతోరణాల్ని కట్ట చూస్తున్నవాడు ఉన్మాదా? భిక్షువా? సాహసా? నీడల్లో తేడాలుంటాయా?…

‘హైడ్ అండ్ సీక్’

నలుగురమూ ఒక్కో చోటు వెతుక్కుని, రహస్యంగా దాక్కున్నాం. మిగిలిన ఒక్కడూ- ఎక్కడున్నామో మమ్మల్ని కనిపెట్టాలి. ** ** ** ** నలుగురమూ ఆ ఒక్కడ్నీ మోసుకెళ్ళి, ఓ చోట దాచి పెట్టేసాం. ఎక్కడున్నా, ఇక ఎప్పటికీ వాడు కనిపించడు.