“ఊషా, తేరా, చక్రా, పేచా!”

  సమయం సరిగ్గా ప్రొద్దున్న 8.00 గంటలు. ప్రాణం కంటే సమయం విలువైనదిగా భావించే మా గురువుగారు పాఠాన్ని ప్రారంభించారు. ఆయన పాణినీయ వ్యాకరణంలో తిమింగలం అయినప్పటికీ, తను ఒక బిందువు అని చెప్పుకొనే మహానుభావుడు. “యథాసంఖ్యమనుదేశః సమానామ్” అనే పాణిని…