స్వస్తి ప్రజాభ్యామ్ – ఒక వివరణ

ప్రపంచ సాహిత్యంలో ప్రాచీన రచనగా ఖ్యాతి పొందిన ఋగ్వేదంలో “ధృవం తే రాజా వరుణో…” అన్న ఋక్కులోని “రాజ” శబ్దం పాలకుడు అన్న అర్థంలో వ్యాఖ్యానించడబడుతుంది. ఆవిధంగా పాలకులకు సంబంధించిన అత్యంత ప్రాచీన ప్రస్తావన భారతీయ గ్రంథాలలో ఉపయోగించబడింది. ఈ ఋక్కును…

గణపతి తత్వం

2016లో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‍కు నేను వ్రాసిన స్క్రిప్ట్ ఇది వేదాలు, ఉపనిషత్తులనే పునాదులపై సనాతన ధర్మం నిలచివుంది. ఈ గ్రంథాలలో వివిధ దేవతల వివరాలు, వారి ఉపాసనా మార్గాలను వివరించడం జరిగింది. మాండూక్య ఉపనిషత్తు “వైశ్వానర” అన్న భగవద్రూపాన్ని…

ఉడుపి శ్రీకృష్ణ ఆలయం – చరిత్ర – ఇతర విశేషాలు

ఉడుపిలో ఉన్న కృష్ణ విగ్రహం విశ్వకర్మ చేత రుక్మిణిదేవి నిర్మింపజేసిందనే పురాణ ఐతిహ్యం ఉంది. ద్వాపర యుగాంతంలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయినప్పుడు ఈ విగ్రహం కూడా సముద్రగర్భంలో చేరింది. ఆ తర్వాత ఎనిమిది వందల ఏళ్ళ క్రితం ద్వైత వేదాంత ప్రవర్తకులైన శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా దొరికింది.

హనుమంతుడు – తోకలో గంట కథ

  [అస్మద్గురువులు శ్రీ విద్యావిజయ తీర్థ స్వామీజీ వారు చెప్పగా విని, వ్రాసినది]   రామభక్తుడు, భయనివారకుడు, అభయప్రదాయకుడు అయిన హనుమంతుని విగ్రహం లేని ఊరు ఈ భారతదేశంలోనే లేదు. గదను పట్టుకున్న వీరాంజనేయునిగా, చేతులు జోడించివున్న దాసాంజనేయునిగా, అభయముద్రతో అభయాంజనేయునిగా,…

“ఔనౌను” – మల్లాది రామకృష్ణశాస్త్రి కథ

మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ’రామ భక్తి’ని పరిపూర్ణంగా సిద్ధించుకున్న ఓ రామ భక్తుని గురించి వ్రాసిన కథ "ఔనౌను."అయోధ్యలో, ఆ పవిత్ర జన్మభూమిలో శ్రీరామచంద్రునికి మళ్ళీ ఆలయం నిర్మిస్తున్న సందర్భంగా ఆ అద్భుతమైన కథను నా గొంతుతో చదివి, వినిపించాలన్న కోరికతో ఈ ధ్వని ముద్రికను చేసాను.వినండి. విమర్శించండి.

లక్ష్మీ వైభవం

శ్రీ లక్ష్మీదేవి –ఎప్పుడూ శాశ్వతమైన ఆనందంతో కూడివుండే నిత్యముక్తురాలు. పంచభూతాల వల్లా, తాపత్రయాల వల్ల, కామ-క్రోధ-లోభ-మొదలైన అరిషడ్వర్గాల వల్లా, కలిగే ఎలాంటి దోషాలు లేని దోషదూరురాలు. ఐహిక, ఆముష్మిక మనే రెండు విధాలైన కోరికలను కోరే భక్తులకు అభయదానం చేసే అభీష్టదాయిని. క్షణమైనా వీడకుండా తన పతియైన శ్రీమన్నారాయణుని సేవలో తరించే హరిపాదసేవోద్యమి. భక్తులకు పాలిట చింతామణి. దుష్టులపాలిట దుర్గారూపిణి. శ్రుతిప్రతిపాద్యురాలైన రమారమణి.

Akshay Tritiya – Meaning & Purport as per Shastras

  Hinduism Everyone in this world is in pursuit of happiness, though they have little idea as to what is an absolute happiness or what action or entity can bring…

దివ్య దీపావళీ

  మానవుని జీవితం ప్రకృతిపై ఆధారపడినది. నిప్పు, నీరు, గాలి  వంటి ప్రాకృతిక శక్తులను చూసి భయపడిన ఆదిమానవుడు వాటిల్ని కొలవడం మొదలుపెట్టాడని పరిశోధకులు చెబుతారు. అయితే, ఆర్ష విజ్ఞానానికి పుట్టినిల్లైన భారతదేశంలో ప్రభవించిన ఋషులు, మునులు ఆయా ప్రకృతి శక్తుల్ని…

భారతదేశంలోని కొన్ని కృష్ణ క్షేత్రాలు

    పండుగ లేనినాడు జీవితం దండుగ అని అనిపిస్తుంది. సంబరం లేని పూట బ్రతుకు దుర్భరంగా అగుపిస్తుంది. ఇందుకే కాబోలు మన పూర్వీకులు ఉత్సవాలను, ఊరేగింపులను, జాతరలను ఏర్పాటుచేసారు. “తమ్ భూమిమ్ దేవనిర్మితమ్” అని పురాణాలు పొగడిన పవిత్రభూమి అయిన…

కృష్ణానదీ తీరంలోని పుణ్యక్షేత్రాలు

  [2016లో వచ్చిన  కృష్ణా నదీ పుష్కరాల సందర్భంగా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ వారు ప్రసారం చేసిన “కృష్ణానదీ తీరంలోని పుణ్య క్షేత్రాలు” అన్న ప్రత్యేక కార్యక్రమానికి నేను వ్రాసిన స్క్రిప్ట్] ఉపోద్ఘాతం   శుక్ల యజుర్వేదంకు చెందిన నిరాలంబ…