నిజంగానే!

వాడు రాత్రి బాటసారి అవతారమెత్తి చేదుపాట పాడుకొంటో సమస్యల్ని తోలుకొంటో అవతలి గట్టుకు వాడు మానవుడా? మిథ్యావాదా? ఆశాదూతా? ఋక్కుల్ని గంటలుగా మోగించుకొంటూ శైశవ గీతిని అద్వైతానికి అర్థంగా చెప్పుకొంటూ జ్వాలాతోరణాల్ని కట్ట చూస్తున్నవాడు ఉన్మాదా? భిక్షువా? సాహసా? నీడల్లో తేడాలుంటాయా?…

తూకం

నాతో పాటు నువ్వూ చేర్తావు కళ్లకు కళ్లు, కాళ్లకి కాళ్లు సమంగా సమానంగా వున్నట్టనిపిస్తుంది   గోడ గడియారం గుండెలో యేదో అపస్వరం   నాతో నువ్వు దూరమౌతావు కళ్లు ఆకసానికి, కాళ్లు నేలలో హెచ్చుతగ్గుల్తో ముందు దారి   అవగాహన…

దేశమును శపించమన్నా!!

ష్ ష్…ఖామోష్ బేటాయాలట్లా ఏడస్తావ్?గుండెల్లో దిగిన గునపాలునిన్నటి గాయాలేలే మొన్న కొట్టినోడ్నిఇయాల ముద్దెట్టుకోమనేగామన తాత చెప్పిళ్ళింది?మళ్ళెందుకేడస్తావ్? చూడు బిడ్డాపడ్డవాడెప్పుడు చెడ్డోడు కానట్టేముడ్డి మీన తన్నినోడూ మనోడే పోఆ గోరీ మీద పూలెట్టిఆ పైన నీ చెవిలో ఎట్టుకోనినీ దేశాన్ని శపించుకో“దేముడా రక్షించు…

నీకర్థం కాదులే బాంచెను!

విగ్రహాలేగా అని విరగ్గొట్టారు హద్దులేగా అని విడగొట్టారు దమ్ముల్లో చెమ్మే ఉంటే బొమ్మల్లో అమ్మల్ని చూసుకోవచ్చు సరే…ఫోండి…విరగ్గొట్టో విడగొట్టో మురిసిపోండీ….మురిగిపోండి!   నా నరం తెగితే నొప్పి నీకు తెలియదు నీ నరం తెగితే……   నరం తెగ్గోసే వరం కోరుకొన్నావ్…

అపద్దపు మాటలు!

భూమికి చంద్రుడికి మధ్యరాకాసి గబ్బిలంలారెక్కలు చాచిన మేఘంచీకటి విషాన్ని చిమ్ముతోంది   తన గుడ్లనే మింగేసి ముడుచుకొన్న పాములాగున్న నది వొడ్డున నీడొకటి ఏడుస్తోంది.   గద్దకి బిడ్డని బలిచ్చేసిన పిట్ట ఏడుపుకి గొంతు కలుపుతోంది చెట్టు   అబ్బా… ఎంత…

బాంబుదాడి

పేలింది.   అనేక ఆశల, పన్నాగాల, జిత్తుల, బాధ్యతలు, భవబంధాల,  వగలమారి జీవితం మండిపోతోంది. మండిపోతున్న జీవితానికి మెలకువే లేదు. మరో వేకువ రాదు.   ఒకడొస్తాడు గడ్డమో, మీసమో, సన్యాసమో ఏదో వొకటితో వొస్తాడు గుండెను మర్చిపోయినవాడు చావును మోసుకొస్తాడు…

నేనో మైదానం!

నేనో మైదానాన్ని!తడిసిపోయిన నోట్లకట్టల్ని ఆరబెట్టుకొన్నట్టుఎండుటాకుల్ని పేర్చుకొంటాచివరల కంటుకొన్న మంచుబొట్లనిపీల్చేసి వాటి బాధ తీరుస్తా రాత్రి వక అమ్మాయి లేత దేహాన్నిగుండెలోకి దించుకొన్నావంటరి తాత “తీసకపోరా! రామా!” అనగానేపరదేశీ మనవడికి తెలీకండాగబీమని లాగేసుకొన్నా జెండాల కోసంగూటింబిళ్ళాట కోసంవళ్ళంతా గోతుల్ని దిగేసుకొన్నా ఎప్పుడైనా! ఆహా(…

నేను మాత్రం….నీ ప్రకృతి

సున్నం కొట్టుకొన్న గోడకు రెండు కంతల కన్నుల్లో రెండు సూర్యగోళాల వెలుగురేకుల్లో ఎగిరి ఎగిరి పోతున్న ధూళి కణాల వేటలో కోట్లాది బాక్టీరియాల వకేవక్క మనసులో పుట్టి పెరిగి పండి రాలిపోయే ఊహల్లో మొట్టమొదటి ఆదిమ ఆలోచన వెనక లుంగలు చుట్టుకొన్న…

క్షణం

మత్తెక్కిన కలల్తో మెరుస్తున్న చీకట్లోరమిస్తున్న నీడలు కోరికల అగ్నిచుంబనం చెమట నదుల్లో ఈదడం…ఆహ్…జిస్ జిస్…. ఆకాశపు లోతుల్లో పేలే మెరుపులకిజలదరిస్తున్న పుడమి వొళ్ళు బహువచనాలన్నింటినీ ఏకం చేసేతుఫాను జీవితంకొన్ని క్షణాలే!

గుర్తింపు

పగలు సూర్య కిరణాల్ని తిని అరిగించుకొన్న నిర్భాగ్యుడొకడువెన్నెలని తాగి ముడుచుకుపోయాడువాడి త్రేన్పులకు రెచ్చగొట్టబడ్డకుక్క తోక అదే పనిగా ఊగుతో… శ్రీ వెంకటేశ్వరా హోటెల్లోలింగైక్య మోక్షగామొకడురీటా సెనరీటా మోటు దేహపు గిటారునిఢాణ్ ఢాణ్ మని మోగిస్తోన్నాడు మబ్బు మొకం చూసుకొంటుంటేచెదరకుండా నిలిచింది చెరువునీళ్ళపై…