మన స్వాతంత్ర్యం మేడిపండు

మన స్వాతంత్ర్యానికి 64 ఏళ్ళు నిండాయి. ప్రపంచంలోనే ఘనతరమైన ప్రజాస్వామ్యం మనదని దరువులు వేసుకుంటూ అవినీతి గురించి, ప్రజా సంక్షేమం గురించి, రైతు సంక్షేమం గురించి, ధరల నియంత్రణ గురించి అరవై నాలుగేళ్ళుగా మనం వింటున్న ప్రసంగాలనే మరోసారి వినిపించారు మన…

వైరుధ్యాలు

Published on 20/10/2007 in www.aavakaaya.com ‘బతికిన క్షణాల’ గురించి ఎంత అందంగా వ్రాసారు వేగుంట మోహనప్రసాదు గారు. మనిషి జీవితంలో ‘బతికిన క్షణాలు’ వేళ మీద లెక్కించుకోవచ్చు. మనం ‘బతకని క్షణాలు’ కూడా గుర్తు చేస్తూ సాగే పుస్తకం అది.…

రమ్మని, పొగ పెట్టటం దేనికి?

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే నిరాహార దీక్ష చేసిన దరిమిలా, కేంద్ర ప్రభుత్వం పౌర సమాజ ప్రతినిధులకు లోక్ పాల్ బిల్లు రూపొందించటానికి ఏర్పడిన సంయుక్త ముసాయిదా కమీటిలో చోటు కల్పించి దాదాపు రెండు నెలలు కావొస్తున్నది. ఒక్కడుగా నిరాహార దీక్ష…

పోయినోళ్ళందరూ మంచోళ్ళా?

“పోయినోళ్ళందరూ మంచోళ్ళు…” అన్నాడు ఓ సినీకవి. అందుకే, బతికున్న రోజుల్లో ఎవడు ఎన్ని వెధవ పనులు చేసినా, వాడు చచ్చిపోయాడని తెలిసినప్పుడు మాత్రం అయ్యో పాపం అనేస్తాం మనం. వాడి చావు, మన మనసుల్లో నిల్చిపోయిన వాడి పాపాలను తుడిచేస్తుంది. వాల్…

కమ్యూ”నిజం” కాలం చేసిందా?

సామాజిక పరిణామ క్రమంలో రకరకాలుగా ఏర్పడే అసమానతలను తొలగిస్తూ సంఘజీవిగా ఉన్న మనిషి సామాజిక జీవనవిధానాన్ని సంస్కరించే ప్రయత్నాన్ని స్థూలంగా కమ్యూనిజమని మనం అభివర్ణించుకోవచ్చు. ప్రతి సమాజంలోనూ పాలించేవారు, పాలింపబడే వారు ఉంటారు. వీరినే, పీడించేవారు (బూర్జువా వర్గం), పీడింపబడేవారుగా (శ్రామిక…

ఎన్నికలు – మరో ప్రహసనం

దాదాపు నెల రోజుల క్రితం అవినీతికి వ్యతిరేకంగా అన్నహజారే ఉద్యమం మొదలేసారు. దాదాపు అదే సమయంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. ఈ నేపధ్యంలో జరగబోయే ఎన్నికలు మరింత ఆసక్తిని కలిగించాయనేది నిర్వివాదాంశం.   గత్యంతరంలేని పరిస్థితుల్లో దాదాపు…

అంతర్యానం

అరమరికలు లేవనుకున్న ఆకాశానికే అడ్డుతెరల్లా ప్రశ్నల చినుకులు పర్వతంలా పరుచుకున్న విషాదపు నిషాలో ఆశ్రునిక్షిప్తమైన ఆకాశం నిండా అపశబ్దాలే.   అర్ధంకాని అలజడి మధ్య ఆకాశం నిద్రపోతున్నదంటే నమ్మలేం! ఆగుతూ, సాగుతూ, పారుతున్న ప్రవాహంలో ఎవరి ఆత్మకథో రాలిపోయిన పూల నవ్వులా…

అన్నలదారిలో అన్నాహజారే… తెలకపల్లిగారు మీరేమంటారు?

విలేఖరి, విశ్లేషకుడు, కవి, రచయిత అయిన తెలకపల్లి రవి గారు “హజారే దీక్ష, హజార్ సవాళ్లు” అనే వ్యాసం తన బ్లాగులో ప్రచురించారు. నరేంద్ర మోడి, నితీష్ కుమార్ లను అన్నా హజారే ప్రశంసించటమనే కారణంతోనే, అన్నా హజారే చేపట్టిన ఉద్యమాన్ని…

అప్పుడు మహాత్మా గాంధి, ఇప్పుడు అన్నా హజారే

డెబ్భై ఏళ్ళు పైబడిన వయసులో అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేపట్టిన సత్యాగ్రహం నిద్రాణమైన దేశానికి మేలుకొలుపు కావాలి. ప్రభుత్వాలలో అవినీతికి వ్యతిరేకంగా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త అన్నాహజారే తన జీవిత చరమాంకంలో పూరించిన శంఖారావం మరో స్వాతంత్ర్య…

మరిన్ని అగాధాల్లో మనదైన ప్రజాస్వామ్యం

లక్ష కోట్లపైగా జరిగిన 2జి స్పెక్ట్రం కుంభకోణంలోని ఒక నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు మూడు దశాబ్దాలపాటు ఈ కేసుని లాక్కుని పీక్కునే అవకాశం కూడా తన ఆత్మహత్యతో కలిగించాడు. అదసలు ఆత్మహత్యో, హత్యో తేలేసరికే ఓ దశాబ్దం పట్టవచ్చు. అప్పటికి…