దత్తోదాహరణ కావ్యము – ఆడియో సహితం

మన సాహిత్యంలో ఉదాహరణము అనునది ఒక లఘుకావ్యం. సంబోధనతో కలిపి ఎనిమిది విభక్తులకూ ఎనిమిది వృత్తాలు రచించాలి. ప్రతి వృత్తానికీ కొసరుగా ఒక కళిక, ఒక ఉత్కళిక అను రగడ భేదాలు జతపరచాలి. ఇదీ స్థూలంగా దీని రూపం. ఇది కేవలం దైవస్తుతికోసం అవతరించిన కావ్యభేదం. వృత్తాలైతేనేమి, కళికోత్కళికలైతేనేమి అన్నీ వెరసి పాతిక పద్యాలు. ఇంకా ఏవేవో నియమాలు లాక్షణికులు చెప్పేరు కానీ కవులందరూ పాటించినవి ఇంతమాత్రమే. మన శరీరంలోని ఉన్న జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, తన్మాత్రలు ఐదు. ఇలా మన వేదాంతులు చెప్పినవి కూడుకుంటూ వెళితే పాతిక విలువ ఏమిటో తెలుస్తుంది. ఇవన్నీ మన శరీరంలో మనతోపాటూ ఉన్నవే. అన్నిటినీ భగవదర్పణ చెయ్యడం ఉదాహరణ కావ్యంలోని పరమార్ధం.

అరబునాట ఆంధ్ర మాట

ప్రపంచంలోని అంతరించిపోతున్న భాషలలో తెలుగు ఏడవ స్థానంలో ఉందని ఆమధ్య ఎవరో ఒక పెద్దాయన అంటుండగా విని చాలా బాధపడ్డాను. ఆమాట కొంతవరకు నిజమే అనిపించింది ఎందుకంటే, కారులేని మిత్రులెవరైనా కుటుంబ సమేతంగా మా ఇంటికొస్తే వారు తిరిగి వెళ్ళేటప్పుడు వారిని వారి…

ఓంకారనాద మంత్రం

స్వరఝరుల సామ మంత్రంస్వరధరుని సార మంత్రంస్వరపూజకాది మంత్రంఓంకారనాద మంత్రం కుసుమాస్త్రుని మసిచేసిన చిచ్చుకంటి మెచ్చురీతిప్రణతుల పార్వతి పలికిన ప్రణవనాద మంత్రంప్రమధ నాధు మురిపించిన ప్రణయనాద మంత్రం కచ్చపి తీవెలపై విచ్చిన స్వరసుమమైసరిగమ స్వరముగ ,,స్వరసుమ సరముగపరిణయ తరుణములో ,,గిరిసుత కరములలోహరువుల విరిమాలై…

సంక్రాంతి ఆ.శ. – పద్యాలు

అశ్వధాటీ వృత్తంలో సంక్రాంతి వర్ణన సప్తాశ్వరూఢుడయి బాలార్కుడీ దినము తా జేరు రాశి మకరం తృప్తాత్ములవ్వ ఘన కూష్మాండ దానములు విప్రాళి కందు సుదినం ప్రాప్తించ పుణ్యగతి గాంగేయుడెంచినటి స్వచ్ఛంద మారణ దినం తప్తాధికంబులకు మార్తాండుడున్ ధరయు సామీప్యమైన అయణం లుప్తంబులై…

శ్రీఆదిభట్ల నారాయణ దాసుగారు – ప్రముఖుల ప్రశంసలు

ఇరు హస్తములతోడ జెరియొక రాగంబు చరణద్వయాన నేమరక రెండు పచరించి, పల్లవిబాడుచు గోరిన జాగాకు ముక్తాయి సరిగనిడుట నయమొప్ప న్యస్తాక్షరియను వ్యస్తాక్షరి ఆంగ్లంబులో నుపన్యాస, మవల నల్వురకున్ దెల్గునన్ నల్వురకు సంస్కృ తంబున వలయు వృత్తాలగైత శంశయాంశమ్ము శేముషీశక్తితో బ రిష్కరించుట,…

ఉదాహరణ కావ్యము

ఉదాహరణము చాలా అరుదైన సాహితీ ప్రక్రియ. సంస్కృతాంధ్రాలలో ఈ ప్రక్రియ ఉన్నాది.  మిగితా భారతీయ భాషలలో ఉన్నదా అంటే ఏమో మరి.పాల్కురికి సోమనాధుడు అను కవి తొమ్మిది వందల సంవత్సరాల క్రితం తెలుగులో తొలి ఉదాహరణము వ్రాసెనని చెప్తారు. ఇందులోని నిజానిజాలు…

దాసుగారి కృతులు, చమత్కృతులు

ధ్రువ చరిత్రము, అంబరీష చరిత్రము, రుక్మిణీ కళ్యాణము, ప్రహ్లాద చరిత్రము, గజేంద్ర మోక్షణము,గోవర్ధనోద్ధరణము,శ్రీహరికధామృతం,సావిత్రి చరిత్రము, భీష్మ చరిత్రము, యధార్ధ రామాయణము, జానకీ శపధము, హరిశ్చంద్రోపాఖ్యానము, మార్కండేయ చరిత్రము, గౌరమ్మ పెండ్లి, హరికధలు, ఫలశ్రుతి. ఇవన్నీ హరికధలు. రామచంద్ర శతకం, కాశీ శతకం,…

హరికధా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు.

  నాయవి నాల్గు మోములవునా యెటు ముద్దిడె? దంచు నల్వ యా ప్యాయముగా హసింపగ, అనంతముఖన్ ననునెట్లు ముద్దిడం బోయెదొ? యంచు వాణి నగ, ముద్దిడెదన్ గను మంచునల్వ నా రాయణ దాసుడై హరికధాకృతిగా నొనరించె భారతిన్.   ముక్కోటి ఆంధ్రులూ…

నారాయణ కళా ప్రదర్శనం (శ్రీఆదిభట్ల నారాయణ దాసు గారి ప్రశంస)

ఎవరీ ముగ్ధమనోజ్ఞ దర్శనుడెవండీ శారదామూర్తి? ఈ నవశృంగార రసావతారు డెవరన్నా? శ్రీమదజ్జాడయే అవునా! ఆ దరహాస మా నడక తీరా ఠీవి ఆ దర్ప మా కవితా దీప్తి అనన్య సాధ్యములురా కైమోడ్పులందింపరా!   కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు…

అమ్మ చిక్కిపోతోంది!

ఆంధ్రుల భాషకు అక్షరాలు ఏబది ఆరు అంటే అవునా అని ఆశ్చర్యపయేవారు, అవును కాబోలు అని సర్దుకుపయేవారూ ఈ మధ్య ఎక్కువమందే కనిపిస్తునారు.అదివారితప్పా?? ఏమోమరి! ఋ, ౠ తరువాత లు లూ( వాటిని ఇక్కడ వ్రాయ వీల్లేదు కదా) ఎప్పుడో మరుగునపడ్డాయి.…