కళలకి, కళాకారులకి భాష, ప్రాంతీయ బేధాలు ఉండవు, ఉండకూడదు అని అంటారు. కానీ, సినిమాను ఒక కళగాను, సినిమా నిర్మాణాన్ని సృజనాత్మక కళగాను భావించేవారు మాత్రం, ప్రస్తుతం తెలుగులో విచ్చలవిడిగా సాగుతున్న పరభాషా నటీనటుల దిగుమతిని ఖండించి తీరతారు. కనీస భాషా…
Category: మాయాబజార్
Something special about cinemas!
నాగిరెడ్డి – నాగయ్య
రేవతీ స్టూడియో అధినేత గా శ్రీనివాస రాఘవన్. సారంగధర సినిమాను భానుమతి, ఎన్.టి.రామారావులు పాత్రధారులుగా సినిమాను నిర్మించారు. ఆ సినిమా ప్రేక్షకుల తిరస్కారమునకు గురి అయ్యినది. నష్టాల్లో కూరుకుపోతూన్న రేవతీ స్టూడియోని నాగిరెడ్డి కొన్నారు.విజయ వాహినీ స్టూడియోగా అది పునర్జన్మను పొందినది.…
ఎన్టీయార్ అంకితభావం
క్రమశిక్షణకు, పట్టుదలకు పేరైన రామారావు నటజీవితంలో కొన్ని మరపురాని ఘటనలు ఉన్నాయి. అందులో ఇదొకటి… ఎన్టీయార్ దర్శకత్వంలో వచ్చిన సీతారామ కళ్యాణం చిత్రంలో ఒక సందర్భంలో రావణాసురుడు తన పది తలల మీద కైలాస పర్వతాన్ని మోస్తున్నట్టు చూపించాలి. మామూలుగా ఐతే…
పుట్టినరోజు జేజేలు – ఇంతకీ ఎవరు ఆమె?
అక్కినేని నాగేశ్వర రావు, బి.సరోజాదేవి, హరనాథ్, నాగయ్య, రేలంగి, గిరిజ, సూర్యకాంతం మున్నగువారు నటించిగా, 1964 లో విడుదల ఐన తెలుగు చలన చిత్రము “అమర శిల్పి జక్కన” లోని ఈ పాట గుర్తుందా!? (అతడు):- మల్లెపూల చెండు లాంటి చిన్నదానా!…
మీసాలు కాల్చుకోవచ్చు!
“పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం” – అని ఎవరు ఎందుకన్నారో మనకర్థం కాకపోతే ఓమారు “రాముడు-భీముడు”ను అడిగి చూస్తే సరి! అవునండి..అందులో శ్రీమాన్ రేలంగిగారు కుమారి గిరిజకు చేసిన పొగచుట్టోపాఖ్యానం వినోదభరితంగానూ, విజ్ఞాన సమ్మతంగానూ సాగుతుంది. నిజాలను మ్మత్తుగా, గమ్మత్తుగా వెల్లడిస్తుంది.…
ది కార్సికన్ బ్రదర్స్ – అలెగ్జాండర్ డ్యుమాస్
“ది కార్సికన్ బ్రదర్స్”- 1941 లో విడుదల ఐన ఈ సినిమాకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. గ్రెగరీ రాటఫ్ డైరెక్టరు, ఎడ్వర్డ్ స్మాల్ నిర్మాత. ద్విపాత్రాభినయములకు ప్రధమ సోపానముగా సినీ చరిత్రలో స్థానం ఆర్జించింది. జూనియర్ డగ్లస్ ఫెయిర్ బాంక్స్ “కార్సికన్…
టీవీ సీరియల్స్ – టైటిల్ సాంగ్స్
స్టార్, జీ, టెన్ స్పోర్ట్స్ వగైరా వగైరా A-Z ఛానల్స్ రాక మునుపు మనకు ఉండిన ఒకే ఒక టీవీ ఛానెల్ దూరదర్శన్. ఎక్కువమంది దాన్ని దుర్దర్శన్ అని పిలిచినా కొన్ని (హిందీ) సీరియల్స్ మాత్రం ప్రజల మనసుల్లో శాశ్వత స్థానం…
బిజినెస్ మాన్ – ద బీప్
ఈ మధ్య మన సినిమాలలో బీప్ ల భాష చాలా ఎక్కువైపోతున్నది. విషయం ఏమిటంటే, మొన్ననే బిజినెస్ మాన్ సినిమా చూసొచ్చాను. ముందు సీనులో ముంబాయిని బీప్ పోయిస్తాననే డైలాగు దగ్గర నుండి, చివరి సీనులో ఇండియాను బీప్ పోయిస్తాననేదాకా చాలా…
ఏడుపుతో బోణీ
ఎస్. జానకి తన కెరియర్ తొలిదశ ఏడుపు గీతాలతో మొదలుపెట్టారు. ఆమె తొలిసారిగా నేపథ్యగానం చేసింది ‘విధియిన్ విళైయాట్టు‘ అనే తమిళ చిత్రానికి. టి.చలపతిరావు సంగీతంలో ఓ శోకగీతంతో తన కెరియర్ ప్రారంభించారు. రెండోసారి నేపథ్యగానం చేసిన సినిమా ‘ఎం.ఎల్.ఎ.‘ అందులో…
రామూ (తెలుగు సినిమా)
1968లో నందమూరి రామారావు, జమున ప్రధాన పాత్రధారులుగా వచ్చిన “రాము” సినిమాకు మూలం ఏదో తెలుసా? 1964లో వచ్చిన హిందీ చిత్రం – “దూర్ గగన్ కీ ఛావోం మే”. ఈ చిత్రాన్ని ప్రముఖ నేపధ్య గాయకుడు కిషోర్ కుమార్ నిర్మించి,…