గాజుల వారి ఆడపడచు, అందెల వారి అక్కయ్య, పగడాల వారి చెల్లెలు, గంధం వారి మేనకోడలు, ముత్యాల వారి మనుమరాలు, మువ్వల వారి మరదలు, ఉంగరాల వారి కాబోయే కోడలు. ********
Category: Musings
Heart as it beats!
భాషా ప్రయుక్త రాష్ట్రం (గాంధీ పుట్టిన దేశo)
బహుయాసల ఊసుల తోరం ఇది ఎల్లలు ఎరుగని ఆదర్శం అందరమొకటిగ కలిసుందాం ,అంతరాలను తరిమేద్దాం అపోహలన్నీ తొలగిద్దాం ,అందరి సమ్మతితో ఉందాం. సమ్మెలనన్ని విడచి ,సమభావనతో నడచి తెలుగువారిగా మెలగాలి ,ఏనాడు జాతిని నిలపాలి ! తల్లీ !ఈ సద్భావననే మాకివ్వు…
సాగవోయి సమైక్యాంధ్రుడా!
సాగవోయి సమైక్యాంధ్రుడా! కదలి సాగవోయి పోరుబాటలో…… నేడే శుభోదయం ఆంధ్రుల మనోబలం -నేడే మహోద్యమం నేడే గళోద్యమం సమైక్యాంధ్ర కోసమని శిబిరాలేసి- నిరాహారదీక్షలోనె ఓ .. ఉపాధ్యాయుడొరిగిపోయే ఉద్యమాలకు ఊపిరిపోసి -ఒకేమాట ఒకేబాట సాగాలోయీ ఆగకోయి సమైక్యాంధ్రుడా !కదలిసాగవోయి సమరపోరులో …
అందాల అమావాస్య
నరకుని వధతో లోకం అంతా ఆనంద వందన చందనములతో శ్రీకృష్ణ సత్యలకు హారతి పట్టి , స్వేచ్ఛా వాయువులనుభవిస్తూ, ముంగిట రంగుల ముగ్గులు వేసి, దీపాలెన్నో….. వరుసలో పెట్టి, వేల కాంతులతో లోకం మెరవగా , అమావాస్యను…
పండని పండుగలు!
వెర్రి తలలు వేసిన వినోదం వెయ్యి టపాసులు గుదిగుచ్చి పేల్చింది వికటించిన వినోదం పక్కింటికి నిప్పెట్టింది ఉన్మాదపు ఉత్సాహం వేయి ఉరుముల్ని ఒకేసారి ఊరికి తెచ్చింది శాంతి ఎరుగని సంబరం అంబరాన్నంటేలా చప్పుడు చేసింది ఎదురుగా…
అన్నీ అవే…కానీ వేరు!
స్టేట్స్ లో స్థిరపడిన నేను ఇండియా వచ్చాను. సుమారుగా రెండున్నర దశాబ్దాల తర్వాత అనుకోకుండా నే చదివిన కాలేజీ ముందు నుండి వెళ్తుండగా ఎన్నో జ్ఞాపకాలు….. నన్ను కారుని ముందుకు పోనీయలేదు. నిదానంగా కారు దిగాను. కాలేజీలోకి అడుగుపెట్టాను. అంతే ఓ…
ఎందుకో!
చిల్లరదొంగలను అల్లరి చేస్తూ ఫోటోలు ఉంచుతారు కూడళ్ళలో , కరడుగట్టిన నేరస్తులను చిల్లుల కవరుతో కవరు చేస్తారు ఎందుకో …….! ****** పట్టెడన్నం తినే తీరిక లేనప్పుడు కోట్లు కూడబెట్టడం ఎందుకో …….! ****** ఊబకాయం వస్తుందని తెలిసికూడా ఊసుపోక బర్గర్లు…
నవతరమా మేలుకో!
నవతరమా మేలుకో!తల్లిపాలు తాగి ఎదిగి, తండ్రి సొమ్ము తినమరిగి,విద్య వినయముల విలువ మరిచి, లక్ష్యమన్నది విస్మరించి,నైతికతకు నీళ్ళు వదలి, చీకటి పథాన చిందులేసి,స్నేహితులతో చెడతిరిగి, మోహాల మొలకల పిలకలేసి,విశృంఖలమైన స్వేచ్ఛా విలాసాలకు, సుఖభోగాలకు చిరునామావై,క్లబ్బులోన, పబ్బులోన, బైక్ రేస్ లోన, యాసిడ్…
అమ్మ భాష
అమ్మ జోల పాడినంత -వీణతీగ మీటినంత శ్రావ్యమైనది మన తెలుగు భాష కన్నతల్లి పాలలా -రాయప్రోలు రాతలా కమ్మనైనది మన తెలుగుభాష అమ్మ కథలు చెప్పినంత – ఆత్రేయ వారి భావమంత కమనీయమైనది మన తెలుగుభాష కన్నతల్లి…
శ్రీనుని శ్రీదేవి చాలా లవ్ చేస్తోంది!
ఈమాట అన్నదెవరు?శ్రీదేవా?శ్రీనా?శ్రీను రాస్తే శ్రీదేవికీ్ విషయం తెలుసా?శ్రీదేవిరాసిందనుకుందాం, శ్రీనుకు తెలుసా?ఈ ప్రశ్నలకి సమాధానాలెక్కడవెదకాలి!తమ దగ్గరికి తాము రాసిన ఈ వేదవాక్కువస్తుందని వాళ్ళనుకున్నారా?అబ్బాయి అమ్మాయిని అల్లరి పెట్తున్నాడా?ఇద్దరూ కలసి పందెం వేసుకున్నారా?ఎక్కడ ఈ శ్రీను శ్రీదేవిలు?అడగాలిపదిరూపాయల నోటుమీదఈ ప్రేమవాక్యం ఎక్కడదాకా ప్రయాణించింది!పూర్వం సీసాలలో…
