బాబాయ్ చెయ్యెత్తుతున్నాడు వెంఠనే దించేసు కుంటున్నాడు. మళ్ళెత్తుతున్నాడు ఠపీమని మళ్ళీ దించేసు కుంటున్నాడు. ఫోన్లే కుర్రవాడు గదా కండలు పెంచేసుకుంటున్నాడేమో అనుకొన్నా. మళ్ళంతలోనే హనుమానం, హాచ్చెర్యాలు చుట్టు ముట్టేసాయి. కండలు పెంచాలంటే జిమ్ముక్కదా వెళ్ళాలా? డంబెల్సు కదా యెత్తాలా? అదేమీ లేకుండా…
Category: Musings
Heart as it beats!
నయా మ్యూజింగ్స్ – కోతులు – కోతలు
“కోతులు కొమ్మల్నే ఎందుకెంచుకుంటా”యని నేనడిగితే “కోతల కోస”మని బాబాయ్ చెప్తాడు. “కోతలంటే యేమి”టని మళ్ళీ అడిగితే “కోతులు మాత్రమే చేసేపనం”టాడు. “అసలింతకీ కోతులంటే యేమిటని?” వెంటబడ్తే “తెల్సిన విషయాల్ని తెలియని వాళ్ళకి తెలిసీతెలియని రకంగా చెప్పు కొసేవాళ్ళ”ని చెప్పాడు బాబాయ్. “యీ…
నయా మ్యూజింగ్స్ – తెగ బోల్డు యుద్ధాల మొదలు…
“ఈ మద్దెన చాలా బోల్డు ఫైటింగులు, ఫైరింగులు జరిగిపోతున్నాయ్ రా. ముక్కూ మొహం తెలీకపోయ్నా కసకసా ఏసేసుకునేస్తుంటార్ట!” పనిపాటాల్లేని రికామి బాబాయి యిల్లా చెప్పేస్తున్నాడో అమాయక జీవికి. గుండు మీదా, గుండె మీదా న్యూస్ఫోరిక్ యాసిడ్నో, గాసిప్ హైక్లోరిక్ యాసిడ్నో పోసేస్కునే…
కాలాతీతం!
కాలాన్ని కరిగించి కాలం చిక్కలేదని కాకి గోల చేస్తే కరుణించేదెవరు? రహదారుల పై కూడళ్ళ వద్ద కుంటుతూ సాగిపోయే ఖరీదైన కార్లు ప్రమాదకర వంకర్లు తిరుగుతూ ద్విచక్రచోదకులు కాలాన్ని వివిధ రీతుల వెచ్చిస్తూ వ్యధ చెందుతున్నారు జీవితం లో సింహభాగం పనికే అందులో…
వరద రాజకీయాలు
వరాలను దయచేయవు ఇవి వారాలకు పరదాలు వేసి చూపిస్తాయి పరదా తీస్తే అది వరం కాదని తెలుస్తుంది ఈలోగా మరో వరద వస్తుంది మొల లోతు నీళ్ళలో మనుషులు సహాయం కోరడం మార్చి మార్చి చూపిస్తాయి టీ వీలు వరదనీరుతొ…
ఓ శనివారం సాయంత్రం
ఒక జంట బైక్ పై హత్తుకొని కూర్చొని ట్రాఫిక్ పద్మవ్యూహం ఛేదించుకొంటూ ఉత్సాహంగా ఊసులాడుతూ, ఊగిపోతూ ఒక సినిమాహాలు చేరి అక్కడి జనసంద్రంలో కలిసిపోయింది ఇంకా నేనున్నానని సాంప్రదాయం చెబుతున్నట్లు ఒక యువతి తలలో విరిసిన మల్లెలు ధరించి స్వచ్చతకు ప్రతిరూపంగా…
నేను మాత్రం….నీ ప్రకృతి
సున్నం కొట్టుకొన్న గోడకు రెండు కంతల కన్నుల్లో రెండు సూర్యగోళాల వెలుగురేకుల్లో ఎగిరి ఎగిరి పోతున్న ధూళి కణాల వేటలో కోట్లాది బాక్టీరియాల వకేవక్క మనసులో పుట్టి పెరిగి పండి రాలిపోయే ఊహల్లో మొట్టమొదటి ఆదిమ ఆలోచన వెనక లుంగలు చుట్టుకొన్న…
చిత్తం
చేతిలో ఆమె చెప్పులు పట్టుకుని ఇరవైనాలుగొసారి వీధిమలుపువేపు చూసా. రోడ్డు ఎండకు పగిలిపోతోంది. బ్రతుకుతో విసుగెత్తిన బిచ్చగత్తె ఒకటి మాత్రం ఓ చివర కూర్చుని వచ్చెపొయె జనాలని , మోటారు వాహనాలను చోద్యంగా చూస్తోంది. ఈ వేళకు ఆమె రావాలే ?!…
స్వాతంత్రానికి ఇరు పార్శ్వాలు
అరవై ఐదు సంవత్సరాల అరుపులు కేకలు శుష్క వాగ్దానాలు క్రియా శూన్యాలు సమాజాన్ని విభజిస్తూ పోవడాలు పాలిటిక్స్ ను ఒక అడ్డాగా మార్చి పాలిస్తూ సంపాదించుకోవడాలు ఇది ఒక పక్క జరుగుతున్న తంతు అయితే మరోపక్క: మత మార్పిడులు జరుగుతున్నా మత విద్వేషాలు కొనసాగుతున్నా లౌకికత పేరుతొ అలౌకికానందం…
సర్వ జీవయానం కేశవం ప్రతి గచ్చతి !
చిన్న రెక్కల పురుగులు అప్పుడే పుట్టి కాంతిని తినడానికి తాపత్రయపడుతూ అంతలోనే నేలరాలతాయి అక్కడే ఉన్న ఎర్ర చీమలు ఇంకా బ్రతికున్నావాటికి తాపీగా భోంచేస్తాయి ఈ అల్లరి చూసిన ఇల్లాలు చీపురుతో తుడిచి చీమల్ని వాటి బతికున్న ఆహారాన్ని చేటకు ఎత్తి అప్పుడే…