పార్లమెంటుకు షష్టిపూర్తి

లాలూలు చిదంబరాలు ప్రణబ్లు శరద్ పవార్లు రేఖలు జయబాధుర్లు జయప్రదలు విజయశాంతులు పండగ చేసుకున్నారీ వేళ  ఇంతలో కొత్తగా వచ్చాడు సచిన్ అంతకు ముందే ఉన్నాడు అజహరుద్దీన్  పార్లమెంటు కేంటీన్ లో అరవై ఏళ్ల రుచులు కొసరి కసరి వడ్డించారు అందరకూ…

యధాదర్శో మలేన చ …

యధాదర్శో మలేన చ … అబద్ధాన్ని కప్పుకొని ఒక నిజం నీలుగుతోంది జుట్టు తెల్లబడితే రంగేసుకొని కప్పిన వయసు లా ముడతలు బడ్డ తనువుని ముదురు లేత రంగు బట్టలు ముచ్చటగా కప్పేసాయి చూపు మందగించినా లాసిక్ లావణ్యాలు కళ్ళ జోడుని…

భక్తి లేదంటే ?!

దేనికోసం ప్రాకులాడతావ్? గట్టిగా ఆకాశం ఉరిమితే దూరంగా పెద్ద పిడుగు పడితే పట్టుమని పది క్షణాలు మెరుపు మెరిస్తే ఒక్క ఉదుటన గాలివీచి చెట్టు కొమ్మల్ని పూనకం వచ్చి నట్లు ఊపితే ఎడతెరిపి లేకుండా కుంభ వృష్టి కురిస్తే సముద్రపుటలలు కొంచం…

బుగ్గైపోయిన బాల్యం

ఎక్కడమ్మా ఆడుకొను? ఎప్పుడమ్మా ఆడుకొను? ప్రశ్నలలో మిగిలిపోయిన బాల్యపు ఆనందం, ఆట పాట అమ్మ చెంత వెచ్చగా పడుకోలేదు అమ్మ కథచెప్పి నిద్ర పుచ్చదు నాన్న తో పార్క్ కి వెళ్ళలేదు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఏడు వరకూ చదువు,…

శూన్యంలో పూలు

పొగ త్రాగరాదులో “దు” చెరిపి వేసే చిలిపి బాల్యాలు, నాలాగేసినాడు దొంగ అని పంటలేసుకోడాలు, నావల్ల కాదు మొర్రో అని స్కెచ్చు పెన్ను మొత్తుకుంటే వెనక కుచ్చు తీసి దాన్లో నీళ్ళు పోసి ఇంకా రంగులు రాబట్టే ప్రయత్నాలు, కరెంటు పోయిన…

భోగట్టా

ఉన్నదంతా పాపపుసోమ్మే అని అందరికీ తెలిసినంతమాత్రాన చెల్లదు న్యాయస్థానం తీర్పు ఇవ్వాలి ఈ లోగా అసోమ్మంతా చక్కగా అనుభవిస్తూ న్యాయం, ధర్మం, చట్టం, నీతి గురించి బోధిస్తూ నాలుగు చెరగులా విలాసంగా సంచరిస్తుంటే ఈనాడు శ్రీధర్ బొమ్మలో పేదోడు వాపోయాడు వాడి…

!!

ఎలా గడచిందో తెలియదు కాని అద్భుతాలను ఆవిష్కరించి వెళ్ళిపోయింది  నేను  అవేంటో తెలుసుకొనే లోపల   ఎలా ముగిసిందో తెలియదు కాని మధుర యాతనలను మదినిండా నింపి నిజాలతో జీవితానికి ముదిపడుతున్న వేల   ఎప్పుడు మొదలైందో తెలియదు కాని అభద్రతా, అశాంతి,…

ఒకటా – రెండా ?

ఒకటా – రెండా ?   కొన్ని పక్షులు చీమల్ని తిని బతుకుతాయి ఆ పక్షులు చచ్చాక వాటి దేహాన్ని ఆ చీమలు తింటాయి   కొందరు కొందరిని దూషించి హమ్మయ్య అనుకొంటే వారిని కొందరు దండించి చేతులు దులుపుకుంటారు   ఒకడు మరొకడికి రావలసింది సగం…

ఇళ్ళు – పునాది రాళ్ళు

నాన్న అనవసరంగా అమ్మను విసుక్కుంటే భయం అమ్మ అనవసరంగా నాన్నను దెప్పి పొడుస్తుంటే సందేహం అమ్మ నాన్న చక్కగా ద్వైత అద్వైతాలగురించి మాట్లాడుకుంటే ముచ్చట నన్ను చెల్లినీ దగ్గర చేర్చుకొని ముద్దు మాటలు చెబుతుంటే హాయి   ఏది శాశ్వతం కాదు…

అంబులెన్సు లో మరణం

 చావుకి దగ్గరౌతుంటే నన్ను ఎత్తి అంబులెన్సులో పడుకోబెట్టారు అంబులెన్సు సీలింగ్ చూస్తూ చనిపోయా అయ్యో ఖర్మ “నారాయణ” అని అనలేదే!!   చచ్చిన 11 రోజుల వరకు ప్రేతాత్మ చచ్చిన చోటే ఉంటుంది గా నేను ఆ అంబులెన్సు లోనే ఉండిపోయా…