చిగురులు

  శిశిరం ఒక కొమ్మ లో ఎండిన ఆకుల్ని చల్ల గాలి హాయిగా కిందకు చేరుస్తుంటే చోచ్చుకోస్తున్న వసంతం ఒక కొమ్మ కి చిగురులు తొడుగుతుంది ఒకే  ఇంట్లో ఒకే సారి జరిగిన  జనన మరణ సంఘటనలు చూసినట్లుంది   చిగుర్లు ముదిరి పచ్చని ఆకులై…

సంక్రాంతి వెత

పచ్చని పరిసరాలు, కొలనులో కలువలు విశాలమైన దేవాలయ ప్రాంగణాలు రోడ్లకు ఇరువైపులా కాపుకాసే చెట్లు ప్రశాంత మైన లోగిళ్ళు అరుగులపై అనుభవాల పంపకాలు వాకిళ్ళలో రంగవల్లులు గొబ్బెమ్మలు ప్రాతః కాలంలో ప్రత్యూష వేళలో హరి నామం చెప్పే హరిదాసు కీర్తనలు ఇవి…

కాలాయ తస్మై నమః

“కొలవెరి 2012”రాబోయే కొత్త ఆంగ్ల వత్సరాదికిహైదరబాద్ హోటలీయుడొకడు చేసినకొత్త నామకరణం. స్వగతాన్ని పర గ(మ)తానికి అమ్ముకొని మన ఉగాదిని మరచినఈ కొత్తరోజున(!)ఏదో సృష్టి ప్రారంభ దినంగా భావించి కేరింతలు కొడుతున్న సమాజానికి కొలవారి 2012 అని చెప్పాలా?నూతన సంవత్సరమని శుభాభినందనాలు అని…

సారీ! ఏమిటిదంతా?

జీవితానికి వెకిలితనం పర్యాయపదంలా అనిపిస్తోందా? అయితే నీ మోక్షమార్గం సులువైనట్టే! దేహం నుండి సందేహం తొలగితేనే ముక్తి వస్తుందని ఒక మహానుభావుడు చెప్పాడు. జీవితం లో ’వి’కారం లోపించినప్పుడు జీవితానికి వెకిలితపు అర్ధం సిద్ధిస్తుంది. ఇది బాగోలేదంటావా! జీవితమే గుల్లైనాక పదాల్నట్టుకు…

కొలవరి… కొలవరి…. ఎవరి వెర్రి?

కొలవరి…..కొలవరి….. ఎవరీ వెర్రి?   పిచ్చి పలు విధాలుపిచ్చిలో పలు పదాలుకొలవరి…కొలవరి రకాలు!! కవిత్వమంటే కొందరికి కపిత్వమంటే కొందరికి కొలవరి అంటే కొందరికి తలవలి ఎందరికో?   కై లో గ్లాసు అద్భుత ప్రయోగమైతే గ్లాసిల్ కై అధునాతన ఒరవడి తాగినోడు…

వింత భ్రమణం

దాచుకున్న డబ్బంతా తనే దోచి ఇచ్చిన తంతు అపార్ట్మెంటు కొనుగోలు అంటే సంపాదన అంతా ఇ.ఎం. ఐ అనే ఒక హారతి కర్పూరమై ఇల్లు మిగిలి  జీవితమౌతుంది డొల్ల   ఇంద్రియ నిగ్రహంతో ఇంతవరకూ దాచిన సొమ్ము ఇవ్వాలంటే ఇంద్రియాలు ఇహ…

దర్శనం-నిదర్శనం

గోపీ చందనంతో ఒకే ఒక ఊర్ధ్వ పుండ్రం తగదని నగుమోము కననీక నామాలు పెడతారు నిజపాద దర్శనం నియంత్రణలో ఉంచుతారు నిజ రూప  దర్శనం ఒక అపురూప భావనామాత్రం చేసారు   వడిబాయక తిరిగెడి వాడిని గుడిలోపల ఆభరణాలలో దాచేసి లఘు, మహాలఘు…

బ్రతుకు

నదిలో ఈదే వాడికి తెలుసు ఎదురీతే ఒడ్డుకి మార్గమని, బద్దకించడు బ్రతకడానికి.కానీ బ్రతుకు బండి లాగే మనిషి, ఆశిస్తాడు కష్టాలు కనికరిస్తాయని, కలిగిన నష్టాలు ఒదారుస్తాయని, మంచి రోజులు వస్తాయని.కల్లోలం లేని కడలి లేదు.కరిగిన వెలుగిచ్చే కొవ్వొత్తి కైనా నిప్పు కావాలి.ఎవరేమన్నా…

వస్తుంది వస్తుంది

ఉద్యోగం చేస్తే డబ్బొస్తుంది,కష్టపడితే చమట వస్తుంది,మీడియా ని చూస్తే నవ్వొస్తుంది,అదే వేర్పాటు/సమైక్య వాదానికి బలమొస్తే హై కమాండ్ కి పనోస్తుంది,సర్కార్ కి బయమోస్తుంది,రాజకీయ పార్టీలకి కలెక్షన్ వస్తుంది,ప్రజలకి విసుగు వస్తుంది, పిల్లలకు సెలవోస్తుంది….మరి తెలంగాణా మాత్రంఏమో!!

సిటీ లైట్స్

ఐదేండ్ల పాప. చేతిలో కర్ర. కుక్కపిల్ల మీద ఒక్క దెబ్బ. కుయ్ కుయ్ . ఇంకో దెబ్బ. కుయ్య్ కుయ్య్ . మరోక దెబ్బ వెయ్యబోయి పట్టుతప్పి పడింది పిల్ల. “అయ్యయ్యో! దెబ్బ తగిలిందా బంగారూ!”. తల్లి లాలన. కుక్కపిల్ల మూలుగు…