“గురూ!” “ఏమి శిష్యా!” “నిన్న అవధాని గారు అడ్డరోడ్డు దాటిన నిజాల్ని చెప్పారు. విన్నారా గురూ!” “కన్నామురా!” “నా తలలో కొన్ని నాలుకలు మాట్లాడుతున్నాయి. చెవిలో ఊదమంటారా?’ “అక్కు శిష్యపక్షీ! పరోపకారమే మన వ్రతమురా…పబ్లిగ్గానే ఊదరా!” “అవశ్యం గురూ! మీరు మహాజ్ఞానులు,…
Category: WoW
Wonders Of the World – Funny, spoof & hillareous news from around the world
అడ్డరోడ్డు కబుర్లు – అన్నా హజారే
“చట్టాలు చేసే విశేషాధికారాలున్న పార్లమెంటునే అన్నా హజారే ప్రశ్నిస్తున్నారు?” – ప్రధాని మన్ మోహన్ సింగ్. ప్రశ్నిస్తున్నాడనే అన్నాను అరెస్టు చేసారే. మరి, పార్లమెంటు మీద తుపాకీ గుళ్ళ వర్షం కురిపించిన అఫ్జల్ గురు సంగతేంటి సార్? “చట్టాలు రూపొందించే పార్లమెంటు…
చిటపటలు-18 “తుగ్లక్ ల చేత, తుగ్లక్ ల కొరకు, తుగ్లక్ ల వలన…”
ఏకు మేకవ్వటం మనకు తెల్సిందే. కొన్ని నెలల క్రితం కొన్ని వందలమందితో జంతర్ మంతర్ దగ్గర అన్నా నిరాహార దీక్ష చేసారు అవినీతికి వ్యతిరేకంగా. దేశవ్యాప్తంగా వేలాదిమంది ఆయనకు బాసటగా నిల్చారు. ప్రభుత్వం దిగొచ్చింది. లోక్ పాల్ బిల్లు ముసాయిదా కమిటీలో…
చిటపటలు-17 “కాంగ్రెస్ లో యువరక్తం”
రాష్ట్ర కాంగ్రెస్ ను యువరక్తంతో నింపే దిశగా రాష్ట్ర పి.సి.సి. అధ్యక్షుడు ప్రయత్నాలు చేస్తున్నాడట. యువరాజును మోయటానికైనా, యువనేతను తోయటానికైనా ఇప్పుడున్న నేతల్లో చేవ చచ్చిందని, అందుకే వారి వారసులకు వల వేస్తున్నాడని గిట్టనోళ్ళు కోళ్ళలా కూస్తున్నట్లు సమాచారం. కేంద్రంలో…
చిటపటలు-16 “దండోపాఖ్యానం – భోళా శంకరులు”
ఈమధ్య డిగ్గీరాజా వారి “దండోపాఖ్యానం” వినే మహద్భాగ్యం మరోసారి కలిగింది. అయ్యవారి “దండబోధ”లో మన రాజకీయ నాయకులెంత భోళా శంకరులనే విషయం తెలిసి కళ్ళు తెరుచుకున్నాయి. అదేలానో మీరూ తెలుసుకోండి. * * * 2007 లో ఏదో దద్దమ్మల సామాజిక…
చింపాంజీ-సహజీవనం!
“ఏమండి!” “ఏమండీ!” “మన పాప…” “కడుపునొప్పా? వుడ్ వర్డ్స్ పట్టూ…” “అబ్బా ఆపండి వేళాకోళం. నేను చెప్పేది వినండి” “అంతకంటే పనేముంది? చెప్పు” “అదే..మన…పాప గురించి…ఇది చాలా తీవ్రమైన విషయం” “అంటే హైలీ సీరియస్ ఇష్యూ అన్న మాట…చెప్పు చెప్పు” “మన…
చిటపటలు-15 “చితకబాదుడు రాజకీయాలు”
ఈమధ్య (21 జులై 2011)టి ఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావ్ గారు ఆంధ్రా భవన్ లో ఓ అధికారిని (కె. చంద్ర రావు) చితకబాదారట! కారణం ఈయన చెప్పిన మాట ఆ అధికారి వినలేదట. మొన్నెప్పుడో (8 ఏప్రిల్…
కన్ఫూషన్ శిష్యుడు – కన్‌క్లూషన్ గురుడు
“గురూ!” “వెర్రోహం! ఏమి శిష్యా?” “అంతా కన్ఫూషన్గా ఉంది గురూ?” “అంటే నువ్వు సిసలైన భారతీయుడవేలే శిష్యా!” “చమక్కులాపి నా చిక్కుముళ్ళను విప్పండి దయచేసి” “హు..హు..హు…అడుసు కడుక్కోడానికి, అజ్ఞానం అడుక్కోడానికే పుట్టాయి శిష్యా. అడుక్కో, కడుక్కో!” “ధన్యోస్మి. దేశంలో స్క్యాములు పెరిగాయి,…
చిటపటలు-14 “మేధావులు, కొశ్శినీలు”
రాష్ట్ర కాంగ్రెస్ లో మేధోమధనం జరగాలని వి.హెచ్. ముఖ్యమంత్రికి, పి.సి.సి. అధ్యక్షుడికి లేఖలు వ్రాసారుట! కాంగ్రెస్ లో మేధావులంటే చేతికి మంత్రదండమైనా ఇస్తారు లేదంటే, కాళ్ళు చేతులు కట్టి కుర్చీలో కూర్చోబెడతారుగానీ వాళ్ళతో మేధోమధనం ఎక్కడైనా చేస్తారా? కాంగ్రెస్ లో, అందునా…
చిటపటలు-13 “కమ్యూనిస్టు శంఖాలు”
అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే, నల్లధనం వాపసు తీసుకురావాలని రాందేవ్ బాబాలు కాంగ్రెస్ ముందు శంఖాలు ఊదుతున్న సంగతి తెలిసిందే. ఆ చప్పుళ్ళకి కాంగ్రెసీయులైతే బెదరలేదు కానీ, కమ్యూనిస్టులకు మాత్రం బల్బులు వెలిగినట్లున్నాయి. జులై 15 నుంచి 21 దాకా ఆ…