మేజర్ సినిమా పై నా అభిప్రాయాలు

Spread the love
Like-o-Meter
[Total: 4 Average: 4.3]

మేజర్ సినిమా నిజజీవితంలో భారత సైన్యంలో మేజర్ గా ఉండిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం పై ఆధారపడి తీసిన సినిమా. ఈ సినిమాలో మేజర్ సందీప్‍గా అడవి శేష్ నటించాడు. శశికిరణ్ తిక్కా దర్శకుడు.

major movie still adavi sesh

ఈ మేజర్ సినిమాను చూసిన తర్వాత ఒక విద్యార్థిగా (ఈ మధ్యనే హైస్కూల్ ముగించి కాలేజ్‍లోకి అడుగుపెట్టాను) నా అభిప్రాయాలను మీతో పంచుకొంటున్నాను.

  1. మేజర్ సినిమా ఆర్మీలో చేరాలనుకునే యువతీ యువకులకు మంచి ప్రేరణను అందిస్తుంది.
  2. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి యథార్థ ఘటనలపై ఆధారపడిన సినిమాలు చాలా తక్కువ వస్తునందువల్ల, టాలీవుడ్ అందించే మాస్ మసాల సినిమాల మధ్య మేజర్ సినిమా ఒక రిలీఫ్ అని చెప్పవచ్చు.
  3. ఈ సినిమా ద్వారా నేను గ్రహించిన ముఖ్యవిషయం ఏమిటంటే – ఆర్మీలో సైనికులు ఎలా ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు మరియు కుటుంబాలు ఎలా త్యాగం చేస్తారు అన్నది.
  4. ’దేశ రక్షణ’ అన్నది ముఖ్యమైన విషయం అని నాకు మేజర్ సినిమా ద్వారా తెలిసింది.
  5. దేశం సురక్షితంగా ఉన్నప్పుడే ప్రజలు కూడా సుఖంగా ఉండగలరు అన్నది నాకు తెలిసింది.
  6. 2008లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణించినప్పుడు నేను చాలా చిన్నవాడిని. ఈ సినిమా రాకపోయివుంటే అతని గురించి తెలిసే అవకాశాలు తక్కువగా ఉండేవి.
  7. దేశం కోసం పాటుపడిన ఎందరో గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ నాలాంటి కొత్తతరానికి వాళ్ళు తెలియకపోవచ్చు. కనుక భారతీయ సినిమా ఇండస్ట్రీ మాస్ మసాల సినిమాలతో పాటు ’మేజర్’ లాంటి సినిమాలను కూడా తయారు చేయాలి.
  8.  సందీప్ జీవితం ఒక్క సైనికులకే కాదు నాలాంటి విద్యార్థులకు కూడా స్ఫూర్తిని ఇచ్చేది. సైనికులు శత్రువుల్ని ఎదుర్కొన్నట్టుగా విద్యార్థులు పరీక్షలను ఎదుర్కోవాలి. సైనికులకు ఆయుధాలు ఉంటే విద్యార్థులకు విశ్వాసం అన్నదే గొప్ప ఆయుధం. ఆ ఆయుధంతో ముందుకు వెళ్ళినప్పుడు ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవచ్చు.
  9. చివరగా, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఫౌండేషన్ తరఫున కొంతమంది యువతీ యువకులను ఆర్మీలో చేర్పించాలని మేజర్ సినిమా బృందం వాళ్ళు ప్రకటించినట్టు పత్రికల్లో చదివాను. ఇది నిజం కావాలని కోరుకొంటున్నాను.

*****

telugu podcasts from aavakaaya

ఆవకాయ.ఇన్ అందిస్తున్న తెలుగు పాడ్కాస్ట్ “ధ్వని” – తప్పక వినండి

Your views are valuable to us!