ఏడుపుతో బోణీ

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఎస్. జానకి తన కెరియర్ తొలిదశ ఏడుపు గీతాలతో మొదలుపెట్టారు.

ఆమె తొలిసారిగా నేపథ్యగానం చేసింది ‘విధియిన్ విళైయాట్టు‘ అనే తమిళ చిత్రానికి. టి.చలపతిరావు సంగీతంలో ఓ శోకగీతంతో తన కెరియర్ ప్రారంభించారు.

రెండోసారి నేపథ్యగానం చేసిన సినిమా ‘ఎం.ఎల్.ఎ.‘ అందులో ఘంటశాల గారితో కలిసి గానం చేసిన ఆ పాట కూడా శోక గీతమే ‘నీ యాసా ఆడియాసా, చేజారే మణిపూసా…

తర్వాత కొన్నాళ్ళకు మళయాళంలోనూ, హిందీలోనూ ఆమె పాడిన పాటలు ఏడుపు పాటలే.

సినీగాయనిగా ఎస్.జానకి గారు జన్మించింది కూడా ఏడుపుతోనే అన్నమాట!!

Your views are valuable to us!