W .H .O . చెప్పినట్లు మనం వినాలా?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సంఖ్య ప్రకారం కంటే ఎక్కువగా సాధించింది అమెరికా. అంటే ప్రతి 1000  మందికి 1.2  డాక్టర్లు పైగా వున్నారు. ముందు ముందు 1000 మందికి 2 డాక్టర్లు వున్నా ఆశ్చర్య పోనక్కర్లేదు. అయితే ప్రస్తుత లెక్కల ప్రకారం 1000 కి 1.2  అంటే సుమారుగా 800 లకు ఒక డాక్టరు అని చెప్పుకోవచ్చును.
 
మరి మన భారత దేశంలో, దేశవ్యాప్తంగా ఏడు లక్షల మంది డాక్టర్లకు (జనాభాలో 0.1 % కూడా లేని కొత్తగా ఏర్పడ్డ వైద్య వృత్తి వారి కోసం మిగిలిన వృత్తుల వారు అనేక జబ్బులు తెచ్చుకోవాలి. అందుకోసం పర్యావరణాన్ని పడుచేయ్యాలి అని AN INDIAN OPINION . పూర్తి వివరాలు కాబోయే  డాక్టర్లు ఎలా బ్రతకాలి? అనే బుల్లిటెన్ లో చూడండి.) 17 లక్షల మంది నర్సుల కొరత వుందని అంకెలు చెబుతున్నాయి. ఏట 70 వేల మంది డాక్టర్లు తయారు  కావలసి వుండగా (డాక్టర్లు అంటే ఒక వాషింగ్ మిషన్ , ఒక మిక్సీ, ఒక కుక్కర్ లా ఫాక్టరీ లో తయారు చేస్తున్నట్లు వుంది కదా! అంటే ప్రస్తుత పాలకుల – విదేశి సంస్కృతిని కాపీ కొట్టాలి గా మరి – దృష్టిలో వైద్యుడు ఒక నిత్యావసర వస్తువు. కానీ భారతీయ సంస్కృతి ప్రకారం వైద్యుడు ఒక అత్యవసర సేవకుడు. (వ్యాపారస్తుడు కాదు) అని AN INDIAN ఒపీనియన్. ఆలోచించండి మేధావుల్లరా!) అందులో సగమే తయారు అవుతున్నారు. దేశంలో ప్రస్తుతం 1, 953  మందికి ఒక డాక్టరు వుండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సంఖ్య ప్రకారం 1000 మందికి ఒక డాక్టరు వుండాలి అంటూ ఇంకా చాల వ్రాసారు ఒక దిన పత్రిక 4 – 1 – 12  న ఎడిటోరియల్ లో.

ఇది డాక్టర్ల సమస్య ? లేక ప్రజల సమస్య ?
 
ఇది ప్రజల సమస్యే! కానీ, ప్రజల్లో ఒక భాగమైన డాక్టర్ల సమస్య. ఎందుకంటె,

1) డాక్టర్ల సంఖ్య ఎంత మంది ఉండాలో నిర్ణయిస్తున్నది. W.H.O. సంస్థ.

2) అదే సంస్థ ప్రజలకు పౌష్టిక ఆహారం తినండి అంటుంది.  ఏది నమ్మాలి.

3) ప్రజలందరికి ఆరోగ్యం మంచిగా వుండాలని ఈమధ్య సేంద్రియ వ్యవసాయం తో చేసిన పంటలు తినండి ఆరోగ్యంగా వుండండి అంటున్నారు. అలాగే చాల రకాల  సంస్థలు న్యూట్రిషియన్ ఫుడ్స్ అంటూ అమ్ముతున్నారు. పర్యావరణాన్ని కాపాడండి, ఆరోగ్యంగా వుండండి అంటున్నారు కొందరు. చివరకు Tea కూడా హెర్బల్ టీ లు అంటున్నారు. చివరకు కొంత మంది డాక్టర్లు కూడా పబ్లిక్ మీటింగ్స్ లో పౌష్టిక ఆహారం తీసుకోండి, సంపూర్ణ ఆరోగ్యం గా వుండండి అని అంటున్నారు.

4) మరి ప్రజలు ఆరోగ్యంగా వుంటే, 1000మందికి ఒక డాక్టరు ఎలా బ్రతకాలి ?

5) యుద్ధాలు రాకపోయినా మిలటిరీ సైన్యాన్ని పోషిస్తున్నట్లు, ఇండ్లు కాలక పోయినా ఫైర్ సిబ్బందిని పోషిస్తున్నట్లు, ప్రజలకు జబ్బులు రాకపోయినా డాక్టర్లను ప్రభుత్వాలు నెల జీతాలుతో పోషిస్తాయి. ( ఇది అవసరం ఇది ప్రజా సంక్షేమంలో ఒక భాగం ) కానీ , ప్రైవేటు హాస్పిటల్స్ ను కూడా పోషిస్తుందా? అంటే ఎంత మందిని పోషిస్తుంది? 
 
6)లేదా ప్రజలందరూ డాక్టర్లను పోషించడానికి అనారోగ్యాల పలు కావాలా? ఇలా ఎందుకు ఆలోచించాలంటే….. ఫైర్ సిబ్బందిని పోషించడానికి మనం ఇండ్లను తగుల పెట్టుకోవడం లేదు కదా! 
 
ఉదాహరణకు ఒక మునిసిపల్ పరిధిలో ఒక లక్ష జనాభా వుంటే వారికీ ఒక ఫైర్ స్టేషన్ వుంటుంది. అక్కడ 1000 మందికి ఒక్కరు చొప్పున లక్షకి 100  మంది సిబ్బంది వున్నారా? పోనీ, 50 మంది సిబ్బంది వున్నారా? లేదు. ఎందుకంటె ప్రతి రోజు ఎవరూ అదే పనిగా ఇండ్లు కాల్చుకోరు. వారు అత్యవసర పరిస్థితిలో సేవ చేస్తున్నారు కనుక వారిని పోషించడంలో ఒక అర్థం వుంది. ఎవరు పోషిస్తున్నారు? ప్రభుత్వం అంటారు ప్రభుత్వం అంటే ప్రజలే. ప్రజల పన్నుల్లో నుండి వారికి కేటాయిస్తారు.

కానీ, W.H.O. సంస్థ చెప్పినట్లు 1000 మందికి ఒక్కరు చొప్పున ఒక లక్ష జనాభాకి 100  మంది డాక్టర్లను పోషించాలంటే ఎలా? ఒక్కొక ఫైర్ మెన్ ని తయారు చేయడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తున్నది. వారికి ఎంత జీతం తో పోషిస్తుంది. దాంతో పోల్చుకుంటే ఒక్కొక డాక్టరును తయారు చేయడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తున్నది. వారికి ఎంత జీతం తో పోషిస్తుంది. (ప్రజలందరికి అంటే లక్ష మందికి పౌష్టిక ఆహారం తో పోషించడం కష్టమని ప్రజందరిని జబ్బులతో రండి 1000 మందికి ఒక్కరు డాక్టరు ను పోషిస్తం  అంటున్నది ప్రభుత్వం.) ప్రజలందరూ పౌష్టిక ఆహారం తీసుకుని ఆరోగ్యం గ వుంటే (అలా వుండాలని ఆశిద్దాం) ఒక లక్షకి 100  మంది డాక్టర్లు అవసరమా? వారికి ఎంత జీతాలు ఇవ్వాలి? ఆ 100  మంది ప్రభుత్వ ఆధీనములో వుంది సేవ చేయాలా? లేక ప్రైవేటుగా సేవ చేయాలా? ప్రైవేటుగా సేవ చేస్తుంటే, వారిని కూడా పోషించాలా? లేదా ప్రజలు ఆరోగ్యాలు పాడు చేసుకోవాలా? 
 
అయితే ఎలా ? పర్యావరణాన్ని పడుచేయండి. అనేక రకాల కాలుష్యాలతో నగరాలను, పట్టణాలను, గ్రామాలను పాడు చేయండి. తద్వారా జబ్బులు తెచ్చుకోండి. ఎందుకంటె, ప్రైవేటు డాక్టర్లు పేషంట్ల కోసం ఎదురుచూస్తున్నారు. పేషంట్లు వస్తేనే వారికి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా బిల్లులు వస్తాయి. ఎందుకంటె వారికి ప్రభుత్వాలు జీతాలు ఇవ్వటం లేదు. లేదాW.H.ఓ సంస్థ చెప్పినట్లు వినకుండా వుండాలి.

ప్రజలకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి అని అనుకుని పర్యావరణాన్ని పాడు చేయకుండా, పౌష్టిక ఆహారాన్ని ప్రోత్సహిస్తూ, జబ్బులు రాకుండా చూడాలి. మనవ వైపరీత్యా(పర్యావరణం పాడుచేసి) జబ్బులు రాకుండా  ప్రకృతి వైపరీత్యా వలన ఎవరికైన జబ్బులు వస్తే వారికి సేవ చేసే విధానం నేర్చుకోవాలి. ఆలోచించండి  మేధావుల్లరా!
@@@@@

Your views are valuable to us!