ఆఖరిమాటగా …

Spread the love
Like-o-Meter
[Total: 3 Average: 4.7]

1
పచ్చి సువాసనలు కమ్ముతుంటే
పచ్చని పొలాల్లో పలురకాల పక్షుల్ని
లెక్కిస్తో
చాలా దూరం పయనించాక
ఓహ్! దారి తప్పాను కాబోలు అనిపిస్తోంది !

2

ఏ నమ్మకాలూ లేవనీ
నువ్వేమో సునాయాసంగా వొదిలించుకుంటావు –
పక్కలో పాముని దాచుకొని నిద్రిస్తున్నట్లు
ప్రతీ నమ్మకమూ అపనమ్మకమే !

3

మనం ప్రేమించుకోలేదు, ద్వేషించుకోనూలేదు ,
అయినా
సరేలే ! మరెప్పుడైనా మాట్లాడుకుందాం అని
అనివుంటే వేచివుండేవాణ్ణి ,

ఆఖరిమాటగా
ఇక మరి మరలిరాలేను అని మాత్రం చెప్పగలను !

Your views are valuable to us!