అల లేని సంద్రమంటే

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

అల లేని సంద్రమంటే – కలలుండే కనుల జంటే

కనురెప్పలనే తెరచాపలతో – నీ హృదయమనే దరిదాపునకు
అలా, అలా సాగనీ – ప్రణయ యాత్రనీ

నేలకు అందని నెలవంక – నాలోనికి చేరని నీ తలపు
గాలికి పరిమళ మందించి – తలవాల్చే పూవుల ఆత్మలతో
ఎలా, ఎలా గడపనూ – ప్రతి గడియనూ
నీ తోడు లేక                                                   ||అల లేని||

వెదికినా దొరకని వేకువకై – వదలక వెదికే లోకంలో
కదలని అతిథౌ చీకటిలో – ఎద కదలిక మెదలని శోకంలో
ఇలా, ఇలా మిణుగురై – చిరుగాలియై
చేరేవ నీవు                                                    ||అల లేని||

Your views are valuable to us!