Like-o-Meter
[Total: 0 Average: 0]
అలుపెరుగని బాటసారి
అలుపెరుగని బాటసారి కదా!
అని,
నా ఇంట ఓ సారి విడిది చేసి పొమ్మన్నాను.
పోతూ పోతూ నాదాన్ని! నినాదాన్ని
నా ఇంటి, ఒంటి పేర్లుగా మార్చిపోయిందీ గాలంటూ
మనసులకు హత్తుకునేలా ఎంత మధురంగా చెబుతోందో
ఆ వేణువు.
*************
పచ్చికదీపాలు
ప్రభాతకిరణాలకు దారి చూపించాలని
తలకు మించిన ఆశలను తలపై దీపాలుగా!
వెలిగించుకు కూర్చున్న ఆ పచ్చికలను,
మనసారా పలకరించి చూడవోయ్!
పేరుకుపోయిన నీ మనసులోని చీకట్లు
వెలుగురవ్వలై విరియకపోతే నన్నడుగు.
*************
హరివిల్లు దాహం
ఏదోనాడు ఆ కొండశిఖరంపై నిలబడి!
నా ముద్దులవానలో ఆ మేఘాలను నిలువెల్లా తడిపేసి,
ఠీవిగా దిగొస్తాను. అపుడు గొంతు తడారి నావొంక
ఆశ్చర్యంగా చూసే ఆ హరివిల్లుకి!
దోసిట్లో నా ఆనందబాస్పాలు పోసి దాహం తీర్చుకోమంటాను.
************
త్యాగమూర్తి
ఎంతటి త్యాగామూర్తో చూశావా! ఈ భయం
తనను చంపడానికి పుట్టిన భక్తికి!
నేటికీ భుక్తిని కల్పిస్తుంది.
************