బహురూపియా

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 4.5]

 

 

1
లేవగానే
ముద్దుగా మొహాన్ని అద్దంలో చూసుకొంటాను –

లేత శిశువంత సుకుమారత్వాన్ని తడుముకుంటాను ,

నా తండ్రి లోని గంభీరత్వాన్నీ
కొడుకులోని చిలిపితనాన్ని
కలగలసిన హృదయోల్లాస పొగరుబోతు క్షణమిది –

నన్ను నేను చూసుకోంటాను మురిపెంగా –

2

పొద్దస్తమానం
వ్యాపార సంభాషణలూ
చోర జార బహువ్యాప్తాలూ –

3
నిద్ర పోయేముందు
అసహ్యంగా మొహాన్ని అద్దంలో చూసుకొంటాను ,
మొహమంతా కత్తిపోట్లూ
అవమానాల రోదనలూ
నెత్తుటి చారికలూ

నాకు బదులుగా మరొకరు ఎదురుబడి అద్దం లోంచే
వెంటాడుతూ బెదిరిస్తూ ….

నిద్రపోయే ముందు
నన్ను నేను జాలిగా తడుముకొని
చంపుకొంటాను నిర్దయగా …

(బహురూపియా! నీకే ప్రేమతో …..)

Buy Aaro Varnam on Kinige.com

Your views are valuable to us!