Like-o-Meter
[Total: 0 Average: 0]
వొళ్ళు విరిచి కను మీటుతూ
మాయమయ్యే కావ్యనాయిక లాటి మబ్బులు-
రెండు చప్టీల మత్తుదనపు వీకెన్డ్-
బహుకాలానికి పలకరిస్తొన్న మరో ఇన్పాంట్ సారో,
బలాదూర్ ప్రయాణాన్ని చెరిచి
ఆత్మహత్యయించుకొమ్మని బెదిరిస్తూ ….
వొర్షించని ఆకాశం లోంచి
డబ్బా లో రాళ్ళ కరకు శబ్దాలు,
దాహం పై కనికరించని నిష్ఫల ఋతువు-
తప్పకుండా రమ్మని వొట్టేయించుకున్న మిత్రుని
ఇంటి ముందు తలుపు కి
వెక్కిరిస్తున్న
అపనమ్మకపు రంగు తాళపుకప్ప!