Like-o-Meter
[Total: 0 Average: 0]
పేలింది.
అనేక ఆశల, పన్నాగాల, జిత్తుల, బాధ్యతలు, భవబంధాల,
వగలమారి జీవితం
మండిపోతోంది.
మండిపోతున్న జీవితానికి
మెలకువే లేదు.
మరో వేకువ రాదు.
ఒకడొస్తాడు
గడ్డమో, మీసమో, సన్యాసమో
ఏదో వొకటితో వొస్తాడు
గుండెను మర్చిపోయినవాడు
చావును మోసుకొస్తాడు
ఆరిన కలల కమురువాసనలో
మసైపోతాడు
పేలిందని తెలీగానే
మన కళ్ళు, ముక్కులూ అన్నీ యేడుస్తాయ్
గుండె మాత్రం ఫేసుబుక్కులోని Like బటనుకు వేళ్ళాడ్తూవుంటుంది
యింతకుమించేం చెయ్యగలమ్ భాయ్!
చెయ్యాల్సిందంతా వాడు చేసేసివెళ్ళిపోయాక!
కదూ!!
సరే పద
చాయ్‍కు పోదాం
బాంబుదాడి లేకుంటే వెనక్కొచ్చి లైకులు కొడ్దాం
లేదంటే బాల్చీని తందాం!