Like-o-Meter
[Total: 0 Average: 0]
పుడమి గుండె కరిగేలా
తన చరమగీతాన్ని
ఎంతందంగా పాడుతుంది
ఆ వాన చినుకు.
*******
అపుడు
రాయి రాయి రాపిడిలో
పుట్టిన నిప్పు
ఇపుడు
మనిషి మనిషి ఎదురైతేనే………
*******
అద్దం లాగే మనసూ
పగిలితే ఒక్క రూపాన్నే
లెక్కకు మించినన్ని సార్లు
చూడాల్సి వస్తుంది.
********