చివరకు మిగిలింది

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]
  yasr-loader

కత్తికి
పిడి దగ్గర పదునులేదనేగా
నువ్విటు నుండి అటుకెళ్ళింది!

నెత్తురుతడిలేని గుండెపైకి
ఇప్పటికెన్నిసార్లు విసిరావో
మొద్దుబారిపోయింది.

కాసేపు ఇలారా
ఈ గరుకు గుండెపైనే
సానబెట్టుకుందువుగాని!

గాయపడితేగానీ అది
గుండె కాలేదన్న నిజం
తెలిసిపోయింది.

నీ కత్తి నూర్పిళ్ళ
వెచ్చదనంలో
బాధలేనితనంను కాక్‍టైల్ చేసుకోవడమే
మిగిలింది.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments