Like-o-Meter
[Total: 1 Average: 4]
ష్ ష్…ఖామోష్ బేటా
యాలట్లా ఏడస్తావ్?
గుండెల్లో దిగిన గునపాలు
నిన్నటి గాయాలేలే
మొన్న కొట్టినోడ్ని
ఇయాల ముద్దెట్టుకోమనేగా
మన తాత చెప్పిళ్ళింది?
మళ్ళెందుకేడస్తావ్?
చూడు బిడ్డా
పడ్డవాడెప్పుడు చెడ్డోడు కానట్టే
ముడ్డి మీన తన్నినోడూ మనోడే
పో
ఆ గోరీ మీద పూలెట్టి
ఆ పైన నీ చెవిలో ఎట్టుకోని
నీ దేశాన్ని శపించుకో
“దేముడా రక్షించు నా దేశాన్ని” అని