ద్విముఖం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

కప్ప

ఓ పెద్ద గెంతు గెంతి,
ఆకాశాన్నంటుకుంది
చెరువునీట్లో.

* * *

అసలే ఆలోచన్లు
చేపల్లా చికాకు పెడ్తుంటే,
లోనికి దూకిన కప్ప
చెరువు ధ్యానాన్ని
చెడగొట్టింది.

Your views are valuable to us!