Like-o-Meter
[Total: 1 Average: 4]
బయట సన్నగా
వర్షం కురుస్తోంది
బాల్కనీలో చలిగాలి
బలంగా తాకుతోంది.
వీధి దీపాల కాంతిలో
వాన చినుకులు మెరుస్తున్నాయి.
వస్తానన్నవాడు రాలేదు
కనీసం ఫోనైనా చెయ్యలేదు.
అసలు ఎవరైనా ఎప్పటికైనా
ఈ గదిలోకి వస్తారా?
ఎవరొస్తేనేం? రాకపోతేనేం?
వాన చినుకుల సవ్వడి వింటూ..
జారుతున్న నీటి బొట్లని చూస్తూ…
అనంతమైన కవిత్వంలోకి..
అక్షరాన్నై ప్రవేశిస్తాను.