ఎక్కడికో…

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఇవాళైనా
ఏమైనా చెప్తావని
ప్రతి సాయంత్రం
నీ తీరానికి వచ్చి
నిల్చుంటాను

మలుపులు తిరుగుతూ
ఏ మార్మికతల్లోకో
మౌనంగా వెళ్ళిపోతావు

కదిలే ప్రవాహంలో
కదలని నీడని చూసుకుంటున్న చెట్టులా
“నేను” మిగిలిపోతాను!

Your views are valuable to us!