Like-o-Meter
[Total: 0 Average: 0]
చావుకు ఆడా మగా తేడాలేనట్లే
ద్వేషానికీ లేదన్న నిజం తెల్సాక
ఆశ్చర్యం
లోకానికేమీ కాలేదు
సిగ్గులేనితనంతో వెల్లకిల్లా పడుకోని పుల్లద్రాక్షల్ని కలవరిస్తాంది
నాకేమో వొంటి మీని బట్టల్నెవరో వూడబెరికినట్ట్లైతాంది!
—-
లింగసౌఖ్యానికి లొంగిపోయిన అమ్మాయొకతె
విసిరికొట్టిన పసిబిడ్డ చుట్టూతా ద్వేషవలయంలా యీగలు!
మురిక్కాల్వ వుయ్యాల్లో
మోసగీతానికి జోలపోతూ ఆ బిడ్డ!
—–
ముళ్ళు మూడురకాలు
గంటలు – నిముషాలు – సెకండ్లు
నొప్పి ఒకటే
—–