ఏటిపాట

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

ఏటిపాట 


కోయిల గొంతు మూగవోయిందని 
తన గళమెత్తి ఎలా పాడుతోందో 
చూడా ఏరు ఈ వనాన. 
 

********
మెరుపుకొరడా

 
మెరుపు కొరడా ఝుళిపిస్తే 
ఇన్ని చెమటలు పోసాయా?
ఆ ఆకాశానికి!
 

********
ముత్యాలహారం

 
ఒంపు తిరిగిన ప్రతి చోట 
ఆ గోదారికో ముత్యాలహారమేయడానికని 
ఎన్ని ముత్యాలను పోగేసిందో ఆ కడలి. 
 

*********
నాగలి

 
ఆకాశం నచ్చచెబితే బెట్టు సడలించి 
మెత్తబడిన ఈ చేలో 
ఎంత అందంగా ముగ్గేసిందో చూడు 
ధాన్యలక్ష్మిని ఆహ్వానిస్తూ ఆ నాగలి. 

 

Your views are valuable to us!