ఎవరివో నీవెవరివో

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఏ ఆమని పిలుపులతో

చిగురించిన తొలకరివో

 

ఏ వెన్నెల వలపులతో

విరబూసిన కలువవో

నా కన్నుల చూపులలో

నటనమాడు కొమలివో

ఎవరివో నీవెవరివో

 

దివి చూడని అందానివో

కవి రాయని పాటవో

గాలి పాడని లాలివో

భువిని లేని సొగసువో

ఎవరివో నీవెవరివో

 

ఏ చిరుగాలి పల్లకిలో

విహరించే సుగంధానివో

ఏ పచ్చని తోటలో

విరబూసిన కుసుమానివో

ఏ వెన్నెల రాతిరిలో

నే రాసిన వలపుల కవితవో

ఎవరివో నీవెవరివో

 

లిపి నేర్చిన చూపువో

వలపు నేర్పిన చెలివో

కలవో మెరుపు మేఖలవో

సరస కావ్యానివో

ఎవరివో నీవెవరివో

* * * * *

నాలో నీ ప్రేమ అజరామరమైనపుడు
నిన్ను నన్ను దక్కించుకునే

భాగ్యమెక్కడి దా మృత్యువుకి.

* * * * *

Your views are valuable to us!