గాయాలూ ఆపాతమధురాలే

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

నా కోసం అన్నైతే

అనుభూతుల పూలను పూయించింది గానీ, కాలం

వాటితో హారమల్లుకునే నేర్పు నాకింకా అబ్బింది కాదు

ఏం  చేయను తీరిక లేని తనంతో

ఆ పూలెప్పుడు  వికసించింది, వాటి పరిమళమేపాటిదని కూడా చూసింది లేదు

ఇక మాధుర్య మకరందమంటావా!

అంత లోతుల్లోకి వెళ్లగలిగేదే నా మనసైతే

ఈ శూన్య వర్ణాలతో నా బ్రతుకెందుకిలా శోభిస్తుందిప్పుడు

ఇక మిగిలిన ఈ నిశ్శబ్దం సాక్షిగా

మరపు పొరలు మనసుపై కప్పడమెట్లో నాకింకా తెలిసిందిగాదు

అందుకే నిలువెల్లా నాలో గాయాలు విరబూస్తున్నాయిప్పుడు

ఆగక జారే కన్నీటిలో ఆనక అన్ని ఆనందభాష్పాలు కలపడానికని

అవునోయ్ కొన్ని గాయాలూ ఆపాతమధురాలే మరి.

*********

Your views are valuable to us!