Like-o-Meter
[Total: 0 Average: 0]
హస్తభూషణం
పుస్తకం హస్తభూషణమని అన్నందుకు
నన్ను చెరసాలలో పెట్టాలంటోంది
నా చరవాణి.
******
విలువలు
గోడలు దాటి విజ్ఞానం బయటకు రానపుడు
గుండెలు దాటి లోనికెలా పోతాయోయ్
విలువలు.
******
బలం
నమ్మడానికి
ఇంత తేలికపాటి మనుషులు దొరికే ఈ దేశాన
అబద్ధాలకు వేయిటన్నుల బలమెందుకు?
******
గస్తీ
ఆడది… అర్ధరాతిరి…. స్వేచ్ఛ….
అని ఆనాడు ఆ మహాత్ముడు అన్న మాటను
నిజం చేయడానికి, కర్ర చేతపట్టి
గల్లీ గల్లీలోను గస్తీ తిరగాలేమో
ఇపుడా గాంధీ విగ్రహాలు
*******