గుండె పాట

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

వెలివేస్తు నన్ను, నువ్వెళ్ళిపోకు
తలపోస్తు నిన్ను, నేనుండలేను
నీ పాటలోని పదములు నేనే
నా బాటలోని పదములు నీవే

ఆ వసంతం విలువ శిశిరం కొలిచేను
ఈ విరహం నిలువెల్ల తొలిచేను
నీలి మేఘమల్లే నీ కురులు జారకుంటేను
పాల కడలి నా మనసు పాలిపోయి సోలెను ||వెలివేస్తు నన్ను||

ఆ దివ్వెల వెలుగు నల్ల పొరలు తుడిచేను
ఈ దవ్వు నేడింక చీకటేల ఏలేను?
చుక్కలాంటి నీ కనులు వెలుగు చూపకుంటేను
చిక్కుముళ్ళ నా కళ్ళు బిక్కుమంటు మూసేను ||వెలివేస్తు నన్ను||

Your views are valuable to us!