గుప్పెడు క్షణాలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

నీ కళ్ళలో

నాకు నేను మరోసారి పరిచయం కాబడతాను

 

నేను నిన్ను హత్తుకున్నప్పుడు

మాయమైపోయిన నా మూలాల

జాడ దొరికినట్లవుతుంది.

 

నీవు నన్ను తాకినప్పుడు

ప్రకృతి తొలినాళ్ళ

నును వెచ్చదనం ప్రసరిస్తుంది.

 

నీ నవ్వు

శబ్దానికి, నిశ్శబ్దానికి వంతెన కడుతుంది.

 

నేను ప్రవహించిపోతాను!

 

ఆ క్షణంలోనే

ఒక సముద్రం నదిలో

లీనమైపోతుంది!

 

Your views are valuable to us!