గుప్పెడు మనసు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

గుప్పెడంతే ఉన్నానంటూనే

ఎన్నో భావాల దొంతరలను దాచుకుంటుంది

ఎన్నో ఊహలకు ఊపిరి పోస్తుంది

ఎన్నో ఆశల సౌధాలకు పునాదులు వేస్తుంది

మరెన్నో స్వప్నాలకు ఊతమిస్తుంది

కాస్తంత సంతోషానికే కడలి తరంగమౌతుంది

కొండంత విషాదమొస్తే ఆల్చిప్ప తానౌతానంటుంది

అనుభవాల వ్యవసాయం చేసి

అనుభూతుల పంట పండిస్తుంది

అలసి అప్పుడప్పుడు  స్తబ్దమౌతుంది

అంతలోకే నూతన చైతన్యంతో ఉరకలు వేస్తుంది

కాస్త కలవరానికే కనుల వెంట జారి

తన ఉనికిని చాటుకుంటుంది


నిత్యం సంఘర్షణ, రాజీలతో సతమతమౌతూనే

నవ వసంతానికై  ఆశగా వేచి చూస్తుంది

నా మనసు.

******

Your views are valuable to us!