నిన్నా మొన్నా మరి చాల సార్లు నువ్వు ఎదురయ్యావు
నువ్వు అచ్చం నీ లాగే వున్నావు
చెయ్యి ఊపానో లేదో ఊపానని అనుకుని వెళ్లిపోయానో
సాయంత్రం కాస్త దూరంగా కనిపించావు
నువ్వు మరొకరిలా వున్నావు మరొకరిగా వున్నావు
ఎవరిలానో చేతులు ఊపుతూ ఎవరి నవ్వులనో నవ్వుతూ
ఆగిపోయాను వచ్చి మాట కలిపాను కలిసి టీ తాగాం
నువ్వు ఎవరని అడిగాను ఏమంటావోనని బిడియంగా
ఎవరినని మాట కలిపావో కలిసి టీ తాగావో… అని నుదురు భలే ఎగరేశావు
హెచ్చార్కే, నేను నీ నేనే, మొన్న చెయ్యి కూడా ఊపకుండా వెళ్లిపోయావు
నేను ఒక నా లానే ఉంటే అంతే కదా అన్నావు
తెలిసిపోయింది
అప్పుడప్పుడు కొందరు గులకరాళ్లను పువ్వులని ఎందుకంటారో
కొట్లాటల్లో గాయాలను వీరుని ఆభరణాలని చావును ముక్తి అని
మానవుడు మహితాత్ముడనీ… …
అబద్ధం కదా అని నేను గుణిశాను, ఎందుకు బద్ధం కావాలి, దేనికి
అని అడిగావు, తరువాత ఇద్దరం చాల ఇష్టంగా తాగేశాం, టీ కాదు
ఇంకెఫ్పుడూ నిన్ను గుర్తుపట్టకపోయింది లేదు, అన్నిటిలో నువ్వే
1-2-3012