Like-o-Meter
[Total: 0 Average: 0]
చర్మం పొరల్లో
దాక్కున్న కాలం
నిజాన్నో, అబద్ధాన్నో
మోస్తూ ఉంటుంది
గులకరాళ్ళ మౌనాన్ని
మింగేసే సెలయేటి సవ్వడిలా
పైపైనే ప్రవహించే కాలం
ఇసుక తిన్నెల్లా ఆలోచనల్ని
మిగిల్చి వెళుతుంది
కణానికో కన్నును తెరిపించి
శాపగ్రస్త దేవత కన్నీటి నవ్వును
పంచరంగుల్లో చూపించే కాలం
అంతుపట్టని కోణంనుండి
తొంగిచూస్తుంది
సత్యానికి, అసత్యానికి మధ్య
నాలోని నన్ను వెదుక్కుంటున్నప్పుడు
నలువైపుల నుంచీ
నన్నావరించుతుంది
కాలగర్భం……