కాలం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

అంతలోనే పుట్టి నీలో నీవే కలిసిపోయే
 
నీ ఇంద్రజాలమెవ్వరికీ అబ్బిందికాదు
 
నీ రూపగోప్యతకాలవాలమై ఎన్నో చైతన్యాలు

నీ ఒడిలో పెరిగి విరుగుతాయి
 
నీ ఏకరూప స్పర్శకు ముగ్ధమొంది

ఏకాంశిక తానై నీ కౌగిట చేరి

వివిధ రూప లావణ్యాలతో

తననలంకరించమంటుందీ  విశ్వం

అలంకరించి తనవంక చూడక సాగే నీ చూపున పడాలని

నీ వెనుకే వస్తున్న విశ్వానికి

ఆ బాటలోనే శాంతి విశ్రాంతులు కల్పిస్తావు

నీలో లేని విభాగాలకు ఎన్నో పేర్లు పెట్టుకుని

ఈ విశ్వ స్రవంతి తనపై

ఎన్నో రంగుల నీడలు పడేట్టు చేసుకుంటుంది.

ఎన్నో అందాలతో భావనలతో  తన వియోగ దుఃఖ స్పందనలను

సాఫల్యానుభూతులను నీకే ఆపాదిస్తూ

నీ చేయూతతో నడిచే విశ్వంలో నేనెంత  నా స్థానమెంత

ఐనా నీ సంపూర్ణ భాగస్తుడిగా నన్నెంపిక చేసి

నాకందుతున్న నీ విలువను నేనెరిగేదెపుడో .

********

Your views are valuable to us!