కావలసింది…

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

వసంతాలు తెగనరుక్కుంటూ 

ఎడారుల్లో పొర్లిపొర్లి ఏడ్చే సంస్కృతి మాది

రాచబాటలా పరిచిన ప్రేమ పూల తివాచీ

మదమెక్కిన మత్తగజంలా

ఒళ్ళుమరచిన అహంతో చిందర వందర చేసి

మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కే సంప్రదాయం మాది

 

నిన్నా మొన్నా ఆపై కనుచూపు సారించినంత మేరా

లొసుగుల చిరుగుల్ను వెతికి వెతికి వేళ్ళాడుతూనే వుంటాము

ఆధునికత భూతద్దాల అభిప్రాయాలతో ఒదిగిపొదిగే రెక్కల్ను

కంటి చూపుల్తో కలం రాతల్తో చీల్చిచెండాడుతూనేవుంటాము

ఎప్పుడో యుగాలక్రితం అజ్ఞానం బ్లాక్ హోల్ లో పడిపోయి

ఏమూలకు చేరుకున్నామో తెలీదుమాకు -తెలుసుకోం కూడా

వ్యక్తిత్వాల ముసుగులో గుద్దులాట పెరిగి పెరిగి

విరిగిపోయేదాకా వీగిపోయేదకా లాక్కుపోతాం

కావలసిందదేకదా … పరోపకారం పరిహారం మాకెందుకు

మేమూ మా స్వేచ్చా -అదే కదా అంతరంగ కధనం

 

రాళ్ళూ రప్పలూ దాటుకుంటూ భూగర్భ చీకట్లను

వేలి వేరు కొనల్తో పెకలించుకుంటూ

జీవజల స్పర్శకోసం తహతహల్తో సాగిసాగి

చెట్టంతా తడిమితడిమి దాహంతీర్చే

వేళ్ళతీరు కాదుమాది … అస్తిత్వం కోల్పోయేందుకు

మేం అమ్మలంకాదు

దర్జాగా నడివీధిన రెప రెపలాడే మా ఉనికికి

ఎవరు వేరైతేమాకేం ఎవరు కొసరైతే మాకేం

పరాన్నజీవుల్లా బలిసి బలిసి

మా రూపాలకు మేంఏ రంగులు పులుముకు

సమాజం నడినెత్తిన తైతక్కలాడతాం

మాకాళ్ళకింద నలిగిపోయెందెవరైతే మాకేం

మా కొత్త రక్తం మత్తుమందులా

ముందుతరాలకూ పంచుతాం.

Your views are valuable to us!