కరాచీ వీధులు

Spread the love
Like-o-Meter
[Total: 3 Average: 5]

1
మొదటి సారి వొచ్చినా
మొహాలన్నీ పరిచయమున్నట్లుగానే వున్నాయి –
ఈ పుర వీధులు
నా కేమీ కొత్తగా కనిపించడంలేదు –
అద్దంలో నా మొహం నాకే కనిపించినంత నిజంగా
అన్నీ సొంత బజారు కరచాలనాలే –
చిన్నప్పుడు తప్పిపోయిన బాల్య స్నేహితులు
ఎదురుపడి పలకరించి బాహువులు పరిచినట్లే వుంది –
కానీ ,
అత్యంత విషాదమేమిటంటే
మా అమ్మమ్మ కనిపినంచడం లేదు,
బహుశా మరణించింది కాబోలు –
బాల్య ప్రేయసీ నన్ను గుర్తించడం లేదు ,
బహుశా మరొకరిని ఇష్టపడుతుంది కాబోలు –
2
ఎంతయినా అతిథిని మాత్రమే కదా !
మళ్ళీ రాకపోవొచ్చు , వొచ్చినా ఎవరూ గుర్తించక పోవొచ్చు ,
నా పుత్రుడికి కానుకగా కరాచీ యాత్ర మరియూ కాశీ యాత్ర
అను రెండు కవితల్ని మాత్రం అంకితం ఇవ్వగలను !
3
నిజం చెప్పనా !
నాల్గు తరాల కిందట త్యజించిన భారాన్ని
వెతికి వెతికీ మళ్ళీ భరించడానికి ఘర్ వాపసి రోజు
ఎంతో దూరం లేదనిపిస్తూంది –
*****
నా చిరకాల అంతరంగిక మిత్రులు కడప రఘోత్తమ రావుకు  ప్రేమగా ….
—–ఇక్బాల్ చంద్

Your views are valuable to us!