కవిత రాయాలనివుంది

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

కవిత రాయాలనివుంది

బాధ లోనో, సంతోషము లోనో,
ఆవేశము లోనో, నిరాశ లోనో ……

బాధ గుండెను పిండేస్తుంటే

కన్నీటిలో కొట్టుకుపోయిన అక్షరాలు
ఎప్పటికైనా తీరాన్ని చేరుతాయేమొనని ఎదురుచూస్తున్నా

సంతోషము మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే
దూది పింజల్లా ఎగిరిపోతున్న మాటల్ని
పట్టుకోవాలని చేతులు చాచి వెంటపడుతున్నా

ఆవేశం నన్ను కుదిపేస్తుంటే
కుదురుగా కూర్చోని పదాలని
బెత్తం పట్టి బెదిరిస్తున్నా

నిరాశ నన్ను సజీవసమాధి చేస్తుంటే
ప్రాణం పోయమని కవితను ప్రాధేయపడుతున్నా

Your views are valuable to us!