“Everywhere I go I find that a poet has been there before me” -Sigmund Freud
దీన్నే రవి గాంచనిది కవి గాంచు అని అన్నారు మన పూర్వీకులు.
అమెరికన్ కవి ఆడెన్ మరింత విశిదంగా చెబుతూ యిల్లా అన్నాడు:
“One demands two things of a poem. Firstly, it must be a well-made verbal object that does honor to the language in which it is written. Secondly, it must say something significant about a reality common to us all, but perceived from a unique perspective. What the poet says has never been said before, but, once he has said it, his readers recognize its validity for themselves.”
ఆడెన్ చెప్పింది మరీ అంత కొత్త విషయమేమీ గాదని తెలుస్తుంది, ఆనందవర్ధనుడి ధ్వన్యాలోకం చదివితే. అందులో ఆనందవర్ధనుడి ఇల్లా అంటాడు
అతో హ్యన్యతమేనాపి ప్రకారేణ విభూషితా
వాణీ నవత్వమాయాతి పూర్వార్థన్వయవత్యపి
చెప్పబడిన ధ్వని ప్రభేదాల మధ్య నుండి యేవొక్క ప్రకారంచేతనైనా అలంకరించబడిన వాణి (కవిత) ప్రాచీనార్థ సంబంధం గలదైనా నూతనత్వాన్ని పొందుతుంది.
ఈ నూతనత్వాన్ని సాధించాలంటే కవిలో “ప్రతిభ” వుండాలంటాడు ఆనందవర్ధనుడు.ఆ ప్రతిభ అనంతమని కూడా అంటాడు.
పై కారికకి విస్తారమైన వ్యాఖ్యానం రాస్తూ అభినవగుప్తుడు “ధ్వనిభేదంవల్ల ప్రతిభలు అనంతమౌతాయా? అనంతాల సంగతి అటుంచు, ధ్వనిప్రభేదాల్లో యే వొక్కదాన్ని పాటించినా ప్రతిభ అనంతమౌతుందని ఆనందవర్ధనుడు యెల్లా చెప్పగలడు? అని ప్రశించుకొంటే ఇది – వర్ణించదగిన వస్తువుతో సంబంధించిన ప్రజ్ఞావిశేషం ప్రతిభ.
[amazon_link asins=’8124603782,8182901391,9351380564,8179776018,812460133X’ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’c4c084a9-dd3d-4cd9-9f82-bc29d43eaceb’]వర్ణనీయ వస్తువు పరిమితమైంది.అది అప్పటికే అనేకమంది కవులచే స్పృశించబడింది.అందుచేత దాన్ని గూర్చి ప్రతిభానం యెవనికి కలిగినా పూర్వకవులు చెప్పినదానిలానే అనిపిస్తుంది. ఇంకేముంది!ఇల్లాగైతే “కవి” అనే ప్రయోగానికే మువ్వు వొచ్చింది.ఐతే ఆనందవర్ధనుడు చెప్పిన కవి ప్రతిభని పట్టి అర్థాలు అనంతాలౌతాయి.ప్రతిభ అనంతమవడం వల్ల కవి వాణి నూతనత్వాన్ని పొందుతుంది.ఇదంతా కవిలోని ప్రతిభ అనంతమైనప్పుడే కుదురుతుంది.
ప్రతిభ అనంతం కావాలంటే అర్థాలు అనంతంగా వుండాలి. అర్థాలు అనంతాలు కావాలంటే అది ధ్వనిప్రభేదాలను పట్టి యేర్పడుతుంది.”అనంటాడు.
ఈ అనంతమైన ప్రతిభ యెల్లా సాధ్యం?అసలు సాధ్యమేనా? లేక “Poets utter great and wise things which they do not themselves understand.” అని ప్లాటో ఎకసెక్కం జేసిన వైనమేనా? కాదనే అన్నారు ప్రాచీనులు.
యుక్త్యానయానుసర్తవ్యో రసాదిర్బహు విస్తర:
మిథోప్యననంతాం ప్రాప్త: కావ్యమార్గో యదాశ్రయత్
రసాలు, భావలు, వాటి యొక్క అభాసాలు, ఆ ఆభాసాల నివృత్తి ఇల్లా అనేక ప్రభేదాలతో కూడిన “ధ్వని” మార్గం విస్తృతమైంది. వేలాదిమంది పూర్వకవులు ఈ రసాదులను ఆశ్రయించే ఈ కావ్యమార్గాన్ని అనేక విధాలుగా త్రొక్కివున్నారు. అతినిపుణుడైన కవికి గోచరమైన యే వాణి అలా లేని అర్థవిశేషాలను అలా ఉన్నట్లు హృదయంలో నిలుపుతుందో అట్టి వాణి సర్వోత్కర్షతో ఉంది (ధ్వన్యాలోకం)
ఇంత కష్టపడీ తన అనంతమైన ప్రతిభ చేత అనంతమైన అర్థాలుగల కవిత్వాన్ని కవి చెప్పగల్గినా “To have great poets there must be great audiences too.” అని వాల్ట్ విట్మన్ అన్నాడంటే చదివే పాఠకుల్లో కూడా విజ్ఞత యెంతో అవసరమని అర్థమౌతుంది.
యేం రాస్తునామన్న స్పృహ, జ్ఞానం కవులకే లేనప్పుడు ఆ స్పృహని, జ్ఞానాన్ని టైం పాస్ కోసమో, మొహమాటం కోసమో, మరింక దేనికోసమో చదివే పాఠకులకుండాలనుకోవడం వాస్తవదూరమే.
ఐతే చోద్యమేవంటే ఈ నిస్పృహని, అజ్ఞానాన్ని విమర్శకుడు కూడా చూపాలన్న పట్టుదల అటు కవుల్లోనూ, ఇటు చదువర్లలోనూ హిమాలయమంత ఎత్తుగా, హిందూ మహాసముద్రమంతా లోతుగా, ఆంధ్రదేశమంత వైశాల్యంతో కళ్ళు మిరుమిట్లు గొల్పుతుండడం.
“Ignorance is bliss” అన్న కవివాక్కు వృధాపోలేదు.
@@@@@