కీచురాయి

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ధైర్యానికని


చీకటికి మంత్రోపదేశం

చేస్తోందా కీచురాయి.

*******

అమ్మకైన గాయం నుండి


పూచిందే నా జీవితమని కాబోలు

దానికెన్ని గాయాలు చేస్తుందో

చూడు ఈ కాలం.

*******

అనురాగాలను బయటికంపలేక

ఏడుస్తున్న ఎన్ని గుండెలకు

స్వాంతననిస్తుందో

ఆ మృత్యువు.

*******

ప్రతిసారీ

మనసు బరువుని
 

తగ్గించలేవోయ్ కన్నీళ్లు.

*******

Your views are valuable to us!