కూడికలు తీసివేతలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఎన్ని భావాలనైనా మోయడానికి

పుష్పకమేమీ కాదోయ్ నా మనసు!

కూడికలు తీసివేతలు నేర్పే

చిన్న బడిలోని నల్లబల్ల

అందుకే ఒకటి చెరిగితే గానీ

ఇంకొకటి దాని మీదకి రాదు మరి

నిజానికి కూడికలు తీసివేతలు అనే

ఈ రెంటి నడుమ నిత్యం జరిగే సంఘర్షణలో

శాంతి విశ్రాంతులు! రెంటినీ కోల్పోయాను నేను

హమ్మయ్య లెక్క సరిపోయింది

రెంటివల్ల రెండే పోయాయి అనుకునే లోపే

చేజారిపోయింది నా జీవన మాధుర్యం

ఐనా ఇంకా తెలుసుకుని తెలివిన పడక

దృశ్యాదృశ్యంగా కొన్ని కూడికల్ని అన్ని తీసివేతల్ని

రచిస్తూనే ఉందా నల్లబల్ల

చేజారిపోతున్న జీవన మాధుర్యం తో తనకు

పనేమిటంటూ?

*********

Your views are valuable to us!