మధురోక్తి

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

1

కొన్ని మధుపాత్రల్ని
నేనే పగలగొట్టాను
మరికొన్నేవో
అవే పగిలాయి-

వాటిని ఏరివేయడంలోనే
రాత్రంతా గడిచిపోతుంది-

2

బహుకాలానికి దొరికిన వొర్షించే చీకటి వొటరితనం —
నన్ను నేను తడుముకోవాలి

విటపురంలో
నర్తించి నర్తించీ
నెత్తురొడుస్తున్న పాదాలు..

ఆకస్మికంగా
బహుమానించుకొన్న ముసురు-
నన్ను నేను స్పర్శించుకొని ముద్దాడుకోవాలి-
జలదరిస్తూ
తూలుతున్న
బహిరంతర దేహాత్మలు –
నన్ను నేను విత్తుకొని మొలకెత్తుకొని
భూరోదసులను రంగులించి
అల్లుకొని స్వప్నించుకోవాలి-

3

చీకట్లో
దారిచూపుతున్న మిణుగురులు-
కనుచూపుమేర
నా ఇంటి గడపలో
ఎవరో కాపలా కాస్తో……

Your views are valuable to us!