Like-o-Meter
[Total: 0 Average: 0]
రైతు
బహుశా నేల విడిచి సాము చేయడం
నేర్చుకున్నాడేమో నీ రైతు
అందుకే దూలానికి వేలాడుతూ అలా ఊగుతున్నాడు
అంటోంది గట్టున చెట్టు ఆ చేనుతో.
**********
మన్నిక
నా కలలన్నీ పగిలాయి
కానీ మా వాడు కొన్న ఈ జోడు మాత్రం
ఊహు, వాడంతే మన్నికకు ప్రాణం ఇస్తాడంటూ
రెండు పండుటాకులు ఆ నాలుగు గోడల మధ్య
కళ్ళు తుడుచుకున్నాయి.
కానీ మా వాడు కొన్న ఈ జోడు మాత్రం
ఊహు, వాడంతే మన్నికకు ప్రాణం ఇస్తాడంటూ
రెండు పండుటాకులు ఆ నాలుగు గోడల మధ్య
కళ్ళు తుడుచుకున్నాయి.
***********
ఆకాశం
కరిగి మాయమయ్యే
మేఘం కోసం గుండెలవిసేలా
రోదిస్తూ ఉరుముతుంది ఆకాశం.
రోదిస్తూ ఉరుముతుంది ఆకాశం.
**********
బృందావనం
అక్కడ కోయిల పిలుపులు లేవు
తేటిని పిలిచే పూవులు లేవు
కానీ ఆ వనాన నిత్యవసంతం
కొలను లేదు కలువలు లేవు
కానీ నిత్యపూర్ణిమ ఆ తీరముఖచిత్రం
అక్కడ పెదవి దాటి ఊరేగిన గాలికి
పాదాలు కదిపే పడుచులాటలో
నిడురన్నది మరచి రాతిరి
ఆ నల్లవాడి రంగైందేమో!
*********
కానీ ఆ వనాన నిత్యవసంతం
కొలను లేదు కలువలు లేవు
కానీ నిత్యపూర్ణిమ ఆ తీరముఖచిత్రం
అక్కడ పెదవి దాటి ఊరేగిన గాలికి
పాదాలు కదిపే పడుచులాటలో
నిడురన్నది మరచి రాతిరి
ఆ నల్లవాడి రంగైందేమో!
*********