మూతబడ్డ జీవితాలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]
  yasr-loader

చచ్చినోళ్ళు ఫ్రేముల్లో బతికినట్లు

నేను ఈ గోడల మధ్యన  అతుక్కునుంటా

బేల పెళ్ళాం చెంపల మీద బేవార్సు మొగుడి దెబ్బలా

కడుపు మీద ఆకలి మడతలు

 

 పచ్చని చెట్ల మధ్యన ఇనుపస్థంబంలా

వెర్రిగా రోడ్డులో దిగబడిపోతాను

లైటు హౌసు దీపంలా ఉండాల్సిన నా మనసు

వానచినుకుల్లో చినుకై కారిపోతోంది

 

లోకంలో నిటారుగా నిలబడ్డానికి

పారిపోతున్న నీడల సందుల్లో

చీకట్లను పట్టుకోవలనుకొంటాను

 

నా మెదడ్లో నేనే అతుక్కుపోతాను

నా గోడల్లో నేనే ఇరుక్కుపోతాను

నా గది తలుపు గడిలో గొళ్ళెమై గొల్లుమంటుంటాను

 

నాదో మూతబడ్డ జీవితం

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments