నాగరికత – మరికొన్ని కవితలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

నాగరికత 
 
నా నాగరికతను 
నలుగురి భుజాలపై 
చూస్తుందీ లోకం. 
 
*******
గోరింట 
 
వేయి వసంతాలుగా విరబూయబోతోంది 
ఆమె భావిజీవితమని! కరపత్రం రాశాయా చిగురాకులు 
ఆ నవవధువు కరమ్ముల. 
 
********
తాంబూలం 
 
మాయమైపోయి మరీ!
తమ కలయికకు ఎంత అందమైన వన్నె తెస్తాయో 
చూడా ఆకు వక్కలు. 
 
**********
కర్తవ్యం 
 
తామెంతగా ముద్దులాటలో మునిగిపోయినా!
తీరాన్ని చేరే తమ కర్తవ్యాన్ని, ఎవరు మరిచారో చెప్పు!
ఆ పడవా? లేక ఈ అలా?
 
*********

 

Your views are valuable to us!