Like-o-Meter
[Total: 0 Average: 0]
ఆషాఢం వలువల్లో
ఆకాశం హొయలుపోతూ
నల్లటి సమ్మోహనాస్త్రాలు
సంధిస్తూంటుంది.
గుండె లోతుల్లో
ఎండిపోయాయనుకున్న భావాల విత్తులు
క్షణాల్లో మొలకెత్తి
కన్నుల్లో విరబూసి
నింగి ఒంపుల్లో ప్రతిబింబిస్తూంటాయ్
గ్రీష్మం నిర్మించిన
నిర్లిప్తపు ఆనకట్ట తెంచుకుని
పరవళ్ళు తొక్కుతున్న
దాహపు సెగల మధ్య
ఒక్క భావాన్నైనా ఘనీభవించాలని
ఆకాశమంత దోసిలి పట్టుకుని
మనసు తెల్లకాగితమై ఎదురుచూస్తూంటుంది.
అన్నిటినీ దోచుకుని
రాచమార్గంలోనే సాగిపోతున్న
కనికరించని మబ్బుల్లో కూడా
అదే భావోన్మాదం…